అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ కు ఆత్మీయ వీడ్కోలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బి సత్య ప్రసాద్ అత్యుత్తమ సేవలు అందించారని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కొనియాడారు.సిరిసిల్ల పంచాయితీ రాజ్ గెస్ట్ హౌస్ లో ఖమ్మంకు అదనపు కలెక్టర్ గా బదిలీ పై వెళ్లిన బి సత్య ప్రసాద్ కు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించి జిల్లా అధికారులు సన్మానించారు.

 Farewell To Additional Collector B Satya Prasad, Additional Collector B Satya P-TeluguStop.com

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు మొదటి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బి సత్య ప్రసాద్ 3 సంవత్సరాలకు పైగా విశిష్ట సేవలు అందించారన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల అమలులో జిల్లా ఉన్నత స్థానంలో నిలవడంలో బి సత్య ప్రసాద్ పాత్ర ఎంతో ఉందన్నారు.

కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రభావంతంగా అమలయ్యేలా మానిటరింగ్ చేశారన్నారు.అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ మాట్లాడుతూ….శిక్షణ కలెక్టర్ గా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి అదనపు కలెక్టర్ గా ఇక్కడనే పనిచేసే అవకాశం తనకు లభించడం అదృష్టంగా భావించానని అన్నారు.సిరిసిల్ల తనకు రెండో హోమ్ టౌన్ అయిందన్నారు.

ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో మంత్రి కే తారక రామారావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అధికారుల సహకారం మరువలేనిదన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీవోలు ఆనంద్ కుమార్, మధుసూదన్, జిల్లా ప్రజా పరిషత్ సీఈవో గౌతంరెడ్డి , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి గంగయ్య, డి ఆర్ డి ఓ నక్క శ్రీనివాస్, డోర్స్ ప్రధాన కార్యదర్శి వినోద్, కోశాధికారి పి బి శ్రీనివాస చారి, జిల్లా అధికారులు, తాసిల్దారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube