రాజన్న సిరిసిల్ల జిల్లా :తెలుగు వెలుగు దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు వెలుగు జాతీయ స్వచ్ఛంద సంస్థ వారు హైదరాబాదులోని త్యాగరాయ గాన సభలో ఆదివారం ఎల్లారెడ్డిపేటకు చెందిన ముత్యాల ప్రభాకర్ రెడ్డికి ఫోటో రంగంలో గాను విశిష్ట కళా రత్న జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.మొక్కల పంపిణీలో భాగంగా పర్యావరణ పరిరక్షణ గాను లెజెండ్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.
ప్రభాకర్ రెడ్డి మండలంలో పల్లవి స్టూడియో నిర్వహిస్తూ తన ఫోటోగ్రఫీలో తీసినటువంటి ఫోటోలు, పల్లె జీవన చిత్రాలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంస్కృతులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సంప్రదాయాలకు ఉట్టిపడే విధంగా తన కెమెరాతో బంధించి ఫోటో ఎగ్జిబిషన్లో ప్రదర్శించి జాతీయస్థాయిలో అదేవిదంగా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు.
రమేష్ గత 12 ఏళ్ల నుండి స్వచ్ఛందంగా మొక్కలను పంపిణీ చేస్తూ మొక్కల వల్ల కలిగే లాభాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాడు.
గతంలో పర్యావరణ సేవారత్న, హరిత స్ఫూర్తి, మహా నంది అవార్డులను అందుకున్నారు.వీరిద్దరి సేవలను గుర్తించి తెలుగు వెలుగు 2023 తెలుగు బాషా సంవత్సరాన్ని పురస్కరించుకొని జాతీయ అవార్డులను ప్రదానం చేశారు.
ఈ సందర్బంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు,డాక్టర్ సత్యనారాయణ స్వామి, డా వాసరవేణి పర్శరాములు,, డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఎలుసాని మోహన్ కుమార్,ఫోటోగ్రాఫర్ ఎండి షాదుల్, పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, మండల రెడ్డి సంఘం అధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, దుబ్బ విశ్వనాథం గుప్తా, చందనం మురళి, యమగొండ బాల్ రెడ్డి, విశ్రాంతి ఉద్యోగి గంప నాగేంద్రం తదితరులు అభినందించారు.