తల్లి హత్య కేసులో తనయుడుకి జీవిత ఖైదు

రాజన్న సిరిసిల్ల జిల్లా :కేసు వివరాల్లోకి వెళ్ళితే తేదీ: 24-06-2021 రోజున రాత్రి తన తల్లి పేరు మీద ఉన్న డబ్బులను కొడుకు తీసుకోనవాలేనని ఉద్దేశ్యంతో తల్లిని రోకలి కర్రతో బాధి చంపిన కేసులో నిందితుడు అయిన యర రాజయ్య కు జీవిత ఖైదు ,5000 రూపాయల జరిమాన విధిస్తూ తీర్పు ఈ రోజు 1st అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సిరిసిల్ల ఎన్ ప్రేమలత తీర్పును వెలువరించారు.

 Life Imprisonment For Son In Mothers Murder Case In Rajanna Sircilla, Life Impri-TeluguStop.com

ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ఇల్లంతకుంట మండలములోని అంతగిరి గ్రామానికి చెందిన యర ఎల్లవ్వ పై బ్యాంకులో తన పేరు మీద ఉన్న 44 లక్షల డబ్బులకు కొడుకు అయినా యర రాజయ్య నామిని ఉండగా తన తల్లిని చంపితే ఆ డబ్బులు తీసుకోవచ్చు అనే దురుదేశ్యం తో కొడుకు తేదీ: 24-06-2021 రోజున రాత్రి ముందస్తు పథకం ప్రకారం రోకలి కర్రతో తల్లి యర ఎల్లవ్వ తల,కొట్టగానే ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, పెద్ద కొడుకు అయిన యర ముత్తయ్య ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ ఐ అయిన రఫీక్ ఖాన్ కేసు నమోదు చేశారు.

సిరిసిల్ల రూరల్ సి.ఐ అయిన ఉపేందర్ దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు.ఇట్టి కేసులో గల 10 మంది సాక్షులను సి.ఐ ఉపేందర్,ఎస్.ఐ రాజేష్ మరియు కోర్ట్ కానిస్టేబుల్ మహేందర్ కోర్టులో ప్రవేశ పెట్టగా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పవన్ కుమార్ వాదించగ, కేసు పూర్వాపరాలు పరిశీలించిన 1వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సిరిసిల్ల న్యాయమూర్తి ఎన్ .ప్రేమలత నిందితులపై నేరం రుజువు కావడముతో జీవిత ఖైదు,5000 రూపాయల జరిమాన విధిస్తూ తీర్పు చెప్పారు.నిందితులకు శిక్ష పడేందుకు సాక్ష్యాదారాలను ప్రవేశపెట్టిన సి.ఐ ఉపేందర్,ఎస్.ఐ రాజేష్ మరియు కోర్ట్ కానిస్టేబుల్ మహేందర్ & నవీన్ సి ఎం ఎస్ ఎస్.ఐ శ్రీనివాస్,కానిస్టేబుల్ నరేందర్ లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube