రాజన్న సిరిసిల్ల జిల్లా: కరోనా మహమ్మారితో ఆకాలమరణం చెందిన విద్యాధికారి మంకు రాజయ్య సేవలు చిరస్మరణీయమని ఎల్లారెడ్డిపేట ఎంపిపి పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల విద్యాశాఖాధికారి కార్యాలయం లో సిబ్బంది శుక్రవారం ఏర్పాటు చేసిన సంతాప సభకు ముఖ్య అతిథులుగా ఎంపిపి పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు పాల్గొన్నారు.
ఈ సంతాప కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు మంకు రాజయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం పాఠశాలలను తీర్చిదిద్దాడని వారు అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రారంభించింది కూడా రాష్ట్రంలో రాజయ్య నే అని వారు అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో బడులను గుళ్ళుగా మార్చినాడని ఎల్లారెడ్డిపేట మండలంలో మండల స్థాయి అధికారులు అందరినీ సమన్వయపరచడంలో కీలకపాత్ర పోషించాడని వారు గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన వంతు కృషి అమోఘం అన్నారు.రాజయ్య పనులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ప్రశంసించారని రాజయ్య స్ఫూర్తి తోనే రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టబడిందని వారు అన్నారు.
రాజయ్య లేని లోటు తీర్చలేనిదని అటువంటి ప్రభుత్వ అధికారి మనకు దొరకరని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన అధికారి కాదు మనలో ఒక కుటుంబ సభ్యుడిని పలువురికి ఆదర్శమని వారు గుర్తు చేశారు.
కరోనా మహమ్మారితో ఆయన మనకు దూరమై రెండు సంవత్సరాలు కావస్తుందని ఆయన భౌతికంగా మనలో లేకపోయినా ఆయన చేపట్టిన పనులు మనకు గుర్తు చేస్తూ ఉంటాయని అన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయంలో తీర్మానం చేసిన ప్రకారంగా ఎంఈఓ మంకు రాజయ్య విగ్రహాన్ని ఎంఈఓ కార్యాలయం ఎదుట వచ్చే వర్ధంతి లోగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అక్కడే మూడవ వర్ధంతి జరుపుకోవాలని ఆయన ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్ , జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావులను కోరారు.
ఈ వర్ధంతి కార్యక్రమంలో తహాసిల్దార్ జయంత్ కుమార్ ,ఎంపీటీసీ సభ్యురాలు ఎనుగందుల అనసూయ , నరసింహులు , రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎండి మజీద్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఒగ్గు బాలరాజు యాదవ్, ఎంఈవో అసిస్టెంట్ యశ్పాల్ ,ఎంఐఎస్ రోషిని , కంప్యూటర్ ఆపరేటర్ నరేష్ , మెసేజర్ రమేష్ , సి ఆర్ పి లు శ్రీనివాస్, చంద్రయ్య, మంగ్యా నాయక్, రమణ సుదర్శన్ ఉపాధ్యాయులు రమేష్ తదితరులు పాల్గొని రాజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.