ఇటీవల కాలంలో యువత మద్యానికి ( youth alcohol )బానిసై ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు.భవిష్యత్తులో మానవత్వం అనే పదానికి చోటు అనేది ఉంటుందో ఉండదు చెప్పలేని పరిస్థితుల మధ్య మనమంతా జీవిస్తూ ఉన్నాం.
ప్రస్తుత సమాజంలో యువతి, యువకులు ఇష్టారాజ్యంగా, విచ్చలవిడిగా జీవించడానికి ఆసక్తి చూపుతున్నారు.ఈ క్రమంలో తమ భవిష్యత్తు పాడు అవడంతో పాటు సమాజాన్ని కూడా నాశనం చేస్తున్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో మద్యం సేవించిన నలుగురు డాన్సర్లు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి, ప్రశ్నించిన వాచ్మెన్ పై దారుణానికి ఒడిగట్టారు.దానికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రాంతంలోని రాఘవ గెస్ట్ హౌస్( Raghava Guest House ) లోని నాలుగో అంతస్తులో ఈనెల 20న చెన్నై నుంచి వచ్చిన నలుగురు డాన్సర్లు అద్దెకు దిగారు.ఈ నలుగురు డాన్సర్లు రాత్రిపూట మద్యం సేవించి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు.గెస్ట్ హౌస్ మొత్తం వినిపించేలా శబ్దాలు చేయడం, మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉండడంతో.వాచ్మెన్ వెళ్లి ఎందుకు ఇలా చేస్తున్నారని గట్టిగా ప్రశ్నించాడు.దీంతో ఆ నలుగురు డాన్సర్లు వాచ్మెన్ తో గొడవకు దిగారు.వాచ్మెన్ మాటలను లెక్కచేయకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ మద్యం మత్తులో నాలుగో అంతస్తు పై నుంచి వాచ్మెన్ తోసేశారు.
వాచ్మెన్ స్పాట్లోనే ప్రాణాలు విడిచాడు.స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరు డాన్సర్లను అదుపులోకి తీసుకున్నారు.
మరో ఇద్దరు డాన్సర్లు పరారీలో ఉన్నారు.వీరి కోసం పోలీసులు నగరం అంతా సీసీ కెమెరాల ఆధారంగా గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ఆ వాచ్మెన్ పేరు యాదగిరి( Yadagiri ) (52), ఆ నలుగురు డాన్సర్లు మద్యం సేవించడంతో పాటు డ్రగ్స్ కూడా వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పూర్తిస్థాయిలో విచారణ చేసి, త్వరలోనే ఏం జరిగిందో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.







