సరదాగా చేసే పనులు ఒక్కోసారి తమ జీవితాన్ని మార్చేస్తాయి.ఆలా ఒక చిన్న సరదా తో ఫోన్ లో తీసిన ఒక షార్ట్ ఫిలిం తమిళ సినిమా ( Tamil movie )ఇండస్ట్రీ కి ఒక గొప్ప దర్శకుణ్ణి పరిచయం చేసింది అంటే నమ్ముతారా ? అయితే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి విషయం మీకే అర్ధం అవుతుంది.ఒకరాజు తన ఆఫీస్ లో కూర్చొని చాల సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నాడు కార్తీక్ సుబ్బరాజు( Karthik Subbaraju ).తాను ఒక టీమ్ కి మానేజర్ అలాగే తన కింద నలభై మంది ఎంప్లాయిస్ పని చేస్తారు.పని చేసుకుంటున్న కార్తీక్ దగ్గరకు టీమ్ లీడర్ వచ్చి ఫ్రాన్స్ కి ఒక ప్రాజెక్ట్ పని మీద వెళ్ళాలి అని చెప్పాడు.కానీ అందుకు కార్తీక్ నో చెప్పాడు.
గతంలో అమెరికా( America ) వెళ్లి ఒక ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి చేసిన అనుభవం కార్తీక్ కి ఉంది.

తాను సరదాగా తీసిన షార్ట్ ఫిలిం కళింగర్ టీవీ కి ( Kalingar TV )షార్ట్ లిస్ట్ అయ్యిది.అలాగే దానికి జడ్జిలుగా ఉంది కమల్ హాసన్, వెట్రిమారన్, భాగ్యరాజ్, బాలచందర్, ప్రతాప్ కె పోతన్ మరియు సి సుందర్ వంటి దిగ్గజ దర్శకులు ఉన్నారు.షార్ట్ ఫిలిం తీసి టీవీ కి ఇచ్చి ఆ విషయం మర్చిపోతే ఆ టీవీ వారు ఫోన్ చేశాకే ఆ విషయం గుర్తుకు వచ్చింది.
అందుకే ఫ్రాన్స్ కన్నా కూడా షార్ట్ ఫిలిం ముఖ్యం అని అందుకని వెళ్లడం కుదరదు అని కరాఖండిగా తేల్చి చెప్పాడు.ఆ తర్వాత బయటకు ఒక పని మీద వెళ్లి మళ్లి తన రూమ్ కి రావడానికి ప్రయత్నిస్తే డోర్ ఓపెన్ అవ్వడం లేదు.
వాస్తవానికి కార్తీక్ కి అన్ని రూమ్స్ కి వెళ్ళడానికి యాక్సెస్ ఉంటుంది.కానీ తన రూమ్ లాక్ ఓపెన్ అవ్వకపోవడం తో సెక్యూరిటీ ని పిలిచి అడిగితే మిమ్మల్ని లోపలి పంపించద్దు అని యాక్సెస్ తీసేశారని బదులు వచ్చింది.
వెంటనే షాక్ కి గురయిన కార్తీక్ టీమ్ లీడర్ కి ఫోన్ చేయగా అతడిని జాబ్ లో నుంచి తీసేసిన విషయం చెప్పాడు.ఫ్రాన్స్ కి వెళ్లకపోతే జాబ్ తీస్తారా అని అడిగిన అవతల వ్యక్తి వినలేదు.

రూమ్ లో తన బ్యాగ్ మరియి వస్తువులు ఉన్నాయ్ అవైనా తీసుకుంటాను అంటే నువ్వు గేట్ దగ్గర వెయిట్ చేయి సెక్యూరిటీ అన్ని తెచ్చి ఇస్తాడు అంటూ చాల అవమానం గా మాట్లాడాడు.దాంతో ఫోన్ లోనే పోరా నువ్వు నీ జాబ్ అంటూ కార్తీక్ మాట్లాడి పెట్టేసి తన వస్తువులు లిస్ట్ మీద రాసి ఇస్తే ఓకే ఆవ్యక్తి తెచ్చి ఇచ్చి నువ్వు ఫోన్ లో మాట్లాడినప్పుడు స్పీకర్ ఆన్ లో ఉంది టీమ్ లీడర్ పరువు పోయిందని చెప్పాడు.కానీ ఆ రోజు ఉద్యోగం పోగొట్టుకున్న ఆ కార్తీక్ మరెవరో కాదు నేడు సంచలన సినిమాలు తీస్తున్న దర్శకుడు, తమిళ్ సినిమా ఇండస్ట్రీ పోకడ మార్చేసిన కార్తీక్ సుబ్బరాజు.పిజ్జా, పేట, జిగర్తాం వంటి సినిమాలు తీసాడు.
రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చెంజర్ కి కథ కూడా కార్తీక్ అందించాడు.ఇక కార్తీక్ షార్ట్ ఫిలిం టూ డైరెక్టర్ జర్నీ మరొక ఆర్టికల్ లో తెలుసుకుందాం.