గ్రీన్ టీ లో ఈ ఆకును కలిపి తీసుకుంటే డబుల్ హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి!

గ్రీన్ టీ.దీని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

 Mixing This Leaf In Green Tea Gives You Double Health Benefits! Green Tea, Green-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సేవించే పానీయాల్లో గ్రీన్ టీ ఒకటి.ముఖ్యంగా ఫిట్నెస్ హెల్త్ పై శ్రద్ధ ఉన్నవారు తప్పకుండా తమ డైట్ లో గ్రీన్ టీ చేర్చుకుంటారు.

గ్రీన్ టీ అంత రుచికరంగా లేకపోయినా ఆరోగ్యానికి మాత్రం అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.అయితే గ్రీన్ టీని నేరుగా కాకుండా ఇప్పుడు చెప్పబోయే ఆకులు కలిపి తీసుకుంటే డబుల్‌ హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆకు ఏంటి.? దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు.? అన్నది చూసేయండి.

మధుపత్రి.

దీనిని స్టీవియా అని కూడా పిలుస్తారు.ఔషధ గుణాలున్న మొక్కల్లో ఇది ఒకటి.

మధుపత్రి మొక్క ఆకుల్లో పంచదార కంటే ఎక్కువ తియ్యదనం ఉంటుంది.అలాగే బోలెడు పోషకాలతో పాటు అనేక ఔషధ గుణాలు సైతం మధుపత్రి ఆకుల్లో నిండి ఉంటాయి.

గ్రీన్ టీతో మధుపత్రి ఆకులను కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి.

Telugu Green Tea, Tips, Latest, Stevia, Stevia Benefits-Telugu Health

అందుకోసం కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో మూడు నుంచి నాలుగు ఫ్రెష్ మధుపత్రి ఆకులు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్రీన్ టీ బ్యాగ్ ను ఒక ఐదు నిమిషాల పాటు మ‌రిగించిన వాట‌ర్ లో డిప్ చేసుకోవాలి.ఆపై టీను ఫిల్టర్ చేసుకుని సేవించడమే.

మధుపత్రి ఆకులు వాడితే ఎలాంటి తేనె అవసరం లేకుండా గ్రీన్ టీను సేవించవచ్చు.

Telugu Green Tea, Tips, Latest, Stevia, Stevia Benefits-Telugu Health

ఈ విధంగా గ్రీన్ టీ లో మధుపత్రి ఆకులను కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.వేగంగా వెయిట్ లాస్ అవుతారు.ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.

పలు రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ తగ్గుతుంది.అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.

జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

నోటి దుర్వాస‌న సమస్య నుంచి సైతం విముక్తి లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube