పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల తక్షణమే స్పందించాలి.

బోయినపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి పోలీస్ స్టేషన్ శుక్రవారం తనిఖీ చేసి పోలీసు స్టేషన్ పరిసరాలు,రికార్డుల నిర్వహణ,విధులలో భాగంగా మెయింటేన్ చేసే రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

 Respond Immediately To The Victims Who Come To The Police Station , Police Stati-TeluguStop.com

మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, పేట్రోలింగ్ లను పెంచాలని, పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధితుల పట్ల తక్షణమే స్పందించలని తెలిపారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నడుస్తున్నాయని అడిగి తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ నిర్వహించాలని,సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందరి దగ్గర ఉండాలని,గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా పై అధికారులకు తక్షణమే తెలియజేయాలని సూచించారు,పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు.

ఎస్పీ వెంట సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ పృథ్విధర్, సిబ్బంది అన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube