రాయిన్ చెరువును సందర్శించిన కాంగ్రెస్ నాయకులు కొండూరి గాంధీ

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామంలోని ఇటీవల పునరుద్ధరించిన రాయిన్ చెరువును మద్దిమల్ల గ్రామస్తులతో కలిసి కాంగ్రెస్ నాయకులు కొండూరు గాంధీ బాపు సందర్శించారు.అనంతరం కొండూరు గాంధీ బాపు మాట్లాడుతూ సుమారు 450 సంవత్సరాల క్రితం మద్దిమల్ల గ్రామస్తులంతా కలిసి గాంధీ బాపు వారసత్వానికి చెందిన పూర్వికులు రాయుడు పేరుపై ఈ యొక్క చెరువు నిర్మించబడిందన్నారు .

 Congress Leaders Konduri Gandhi Visited Raain Lake, Congress Leaders, Konduri Ga-TeluguStop.com

ఎన్నోసార్లు వర్ష ప్రభావానికి కట్టతెగిపోవడం మరల దాన్ని మరమత్తు చేయడం జరిగిందని,1998 సంవత్సరంలో ఎంపీగా ఉన్న విద్యాసాగర్ రావు రాయిన్ చెరువు మరమ్మత్తుల కోసం పది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.

అయిన సరిపోకపోవడంతో, గాంధీ బాపు రాయిన్ చెరువు మరమ్మత్తుల కోసం ప్రభుత్వాలకు వినతి పత్రాల ద్వారా విన్నవించగా 30 లక్షల వరకు మంజూరు చేయడం జరిగిందనీ తెలిపారు .గతంలో కాంగ్రెస్ నాయకులు ఇరిగేషన్ మినిస్టర్ పాటిరాజం, చోక్కరావు ఈ రాయిన్ చెరువును రైతులకు అందుబాటులో తీసుకురావడానికి కృషి చేశారు.సుమారు 29 ఎకరాల భూమి ఈ చెరువులో మునుగుతోందని, 20 ఎకరాల భూమి కొండూరు గాంధీరావుదని మద్దిమల్ల గ్రామ ప్రజల క్షేమం కోసం ఆయన వదులుకున్నారనీ అన్నారు .మద్దిమల్ల గ్రామంలో మరో రెండు గ్రామపంచాయతీలు గోపాల్ రావుపల్లి, బంజరు తండా కొత్తగా ఏర్పడ్డాయని,1988 నుండి 1994 సంవత్సరం వరకు కొండూరు గాంధీ బాబు ఏకగ్రీవంగా సర్పంచ్ గా కొనసాగారనీ,

మద్దిమల్ల గ్రామంలో ఎక్కువగా దళిత, బడుగు బలహీన వర్గాల ప్రజలు నివసిస్తున్నారని, రాయిన్ చెరువు సుమారు 2000 ఎకరాల ఆయకట్టు వరకు పారుతోందని లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి రాయిన్ చెరువులో నీరు నిల్వ ఉండే విధంగా ప్రభుత్వం కృషిచేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గాంధీ బాపు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాజీ సర్పంచ్, జోగుల సుదర్శన్, జవహర్లాల్, నాయకులు, సంతోష్, లచ్చయ్య, రవి, మహేష్, నాగరాజు, సతీష్, దేవ్ సింగ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube