రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రకృతి వనం పేరును స్వర్గీయ కీర్తిశేషులు మాజీ ఎంపీపీ నేవూరి వెంకట్ రెడ్డి బాపు పేరిట మార్చాలని ఎల్లారెడ్డిపేట మండల స్పెషల్ ఆఫీసర్ ఎంపిడిఓ సత్తయ్యకు వినతిపత్రం సమర్పించారు.అదేవిధంగా వెంకట్ రెడ్డి పాలరాతి విగ్రహాన్ని ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లోని నెహ్రూ విగ్రహం ఎదురుగా డివైడర్ మధ్యలో ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని వినతిపత్రం లో కోరారు,
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు బాలరాజ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి , గుర్రపు రాములు , వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్ , బుచ్చి లింగి సంతోష్ గౌడ్ , పుల్లయ్య గారి తిరుపతి గౌడ్ , కొన్నే పోచయ్య లు వినతి పత్రాన్ని కార్యదర్శి దేవరాజు కు అందజేశారు.