లైన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట నూతన అధ్యక్షులుగా కోట సతీష్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల లైన్స్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్షులు గా కోట సతీష్ ను శుక్రవారం సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.లయన్ సెక్రటరీ గా భాస్కర్ రెడ్డి, ట్రెజరర్ గా లయన్ రావుల లింగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 Kota Satish Kumar As The New President Of Lions Club Of Yellareddypet, Kota Sati-TeluguStop.com

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న లయన్స్ గవర్నర్ శివప్రసాద్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ అనేక మహోన్నత కార్యక్రమాలను నిర్వహించి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుందన్నారు.అనంతరం నూతన అధ్యక్షుడు లయన్ కోట సతీష్ కుమార్ మాట్లాడుతూ లైన్స్ క్లబ్ సమక్షంలో ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు చేశామని ఇకముందు కూడా మరెన్నో కార్యక్రమాలు చేస్తామని అన్నారు.

ఇందులో భాగంగా లయన్స్ క్లబ్ సేవా స్ఫూర్తి, మానవత దృక్పథం తో నిండి ఉండాలని అన్నారు.అవసరమైన వారిని గుర్తించి, వారికి మన తోడ్పాటు అందించడం మన క్లబ్ కర్తవ్యంగా భావించాలని, మనమందరం ఒక కుటుంబం లాగా పని చేసి, సమాజానికి మంచి సేవలను అందించాలని ఆయన తెలిపారు.

కంటిచూపు పరీక్షలు, కంటిచూపు ఆపరేషన్లు చేయించటం, కంటి అద్దాలు ఇవ్వటం,చెవిటి వారికి పరీక్షలు చేపించి వారికి చెవిటి మిషన్లు పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తామని అన్నారు.అవిటి వారికి, కాళ్ళు లేనివారికి వీల్ చైర్స్,మూడు చక్రాల బండ్లు ఇప్పించడం జరుగుతుందని అన్నారు.

మూగవారికి, పరీక్షలు జరిపి వారికి ‘స్పీచ్ థెరపీ’ లాంటివి చేయిస్తామనీ తెలిపారు.రక్తదానం శిబిరాలు నిర్వహించి, రక్తదానాన్ని ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.చక్కెర వ్యాధి ఉన్నవారికి, ‘కేన్సర్’ రోగులకు, ‘ఎయిడ్స్’ రోగులకు, ‘కుష్ఠు; రోగులకు, పరీక్షలు నిర్వహించి వారికి వైద్యం అందించడం చేస్తామని అన్నారు.కొన్నిచోట్ల అంబులెన్స్ సేవలు లేవని, లేని కాడ కూడా అంబులెన్స్ సేవలు అందించడం జరుగుతుంద న్నారు.

అనాధాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు,సహాయం చేయటంలో ఎంతో మంచిదన్నారు.

వాతావరణ కాలుష్యం, వాతావరణ పరిరక్షణ,ప్రపంచ శాంతి కోసం మేము ఎంతో కృషి చేస్తామని తెలిపారు.

ఆరోగ్య శిబిరాలు,గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందిస్తామని అన్నారు.విద్యా సహాయం పేద విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

పర్యావరణ సంరక్షణ వృక్షారోపణ, పర్యావరణ శుభ్రత కార్యక్రమాలు నిర్వహించడంలో మేము సైతం పాలుపంచుకుంటామని తెలిపారు.ముఖ్యంగా చెప్పాలంటే చిన్న సన్నకారు రైతులకు అన్ని వీధాల విత్తనాలు అందజేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పయ్యావుల రామచంద్రo, ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, నందికిషన్, సద్ది లక్ష్మారెడ్డి రావుల లింగారెడ్డి , కోమిరిశెట్టి తిరుపతి లైయిన్ క్లబ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube