రోజు మొత్తం ఎండలో తిరగటం వలన ముఖం నిర్జీవంగా,డల్ గా మారుతుందా? గంటల తరబడి పని చేస్తున్నప్పుడు మీ కళ్ళు అలసటగా మారుతున్నాయా? ఇలా డల్ గా నిర్జీవంగా మారిన చర్మాన్ని కాంతివంతంగా చేయటానికి మీరు డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు.వంటింటిలో దొరికే కొన్ని వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.
అది ఎలాగా అనేది ఒక్కసారి చూద్దాం.
నిమ్మరసం, రెండు స్పూన్ల పాలలో ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ ప్యాక్ స్నానానికి వెళ్లే ముందు వేసుకుంటే మంచిది.
టమోటా,పెరుగు, ఓట్ మిల్…ఫేస్ ప్యాక్ టమోటాలను పేస్ట్ చేయాలి.ఈ పేస్ట్ లో పెరుగు,ఓట్ మీల్ పొడిని కలపాలి.ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.ఈ ప్యాక్ ముఖాన్ని తెల్లగా మారుస్తుంది.
ఆరెంజ్ పీల్+పెరుగు చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా తయారు చేయడంలో పెరుగు ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.ఆరెంజ్ పీల్, పెరుగును సమాన మోతాదులో తీసుకుని ముఖంపై అప్లై చేయాలి.
తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ పాక్స్ని ఉపయోగిస్తే చర్మం కాంతివంతంగా,మెరుస్తూ ఉంటుంది.