సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ఘనంగా పివి నరసింహారావు జయంతి

సిరిసిల్ల తెలంగాణ భవన్ లో భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి దేశాభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పివి నర్సింహారావు అని తెలంగాణ రాష్ట్రంలోని మన కరీంనగర్ ముద్దుబిడ్డ కావడం గర్వకారణమన్నారు.

 Pv Narasimha Rao Jayanti Was Celebrated In Sirisilla Telangana Bhavan , Sirisil-TeluguStop.com

బహుభాషా కోవిదుడు, జాతీయవాది, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని వారు కొనియాడుతూ భూసంస్కరణలలో భాగంగా పేదలకు తన భూమిని పంచిన గొప్ప సంస్కర్త పీవీ అన్నారు.ఆయన ఆశయాలను కొనసాగిస్తూ, భావితరాలకు స్ఫూర్తిగా అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మాజీ టెక్స్ట్ టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందము కళ చక్రపాణి, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, కుంబాల మల్లారెడ్డి, ఎంపీపీ పడిగెల మానస రాజు, మాట్ల మధు, గజభింకార్ రాజన్న, సురేష్ నాయక్, సికిందర్, కందుకూరి రామగౌడ్, కంచర్ల రవి, శ్రీనివాస్, వెంకటేష్, సందీప్, ధనుష్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube