జిల్లాలో అక్రమ గంజాయి పై జిల్లా పోలీస్ ఉక్కుపాదం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్( Vemulawada Town Police Station ) లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రానికి చెందిన పుర్టీ బిర్ష అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రం( Odisha) లోని నబరంగాపూరు నుండి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి అక్కడి నుండి వేములవాడ, సిరిసిల్ల చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయికి అలవాటు పడిన వారికి ఎక్కువ ధరకు అమ్మడానికి వేములవాడ పట్టణ పరిధిలోని చెక్కపల్లి రోడ్ వైపు నడుచుకుంటూ సోమవారం రోజున మద్యాహ్న సమయంలో వస్తున్నాడన్న నమ్మదగిన సమాచారం మేరకు వేములవాడ పోలీసులు అట్టి వ్యక్తిని చెక్కపల్లి రోడ్ లోని పెద్దమ్మ గుడి దాటినా తరువాత పట్టుకొగా అతని వద్ద ఉన్న నిషేదిత 14.590 కీలోల గంజాయిని సీజ్ చేసి పై వ్యక్తుని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.జిల్లాలో గంజాయి నిర్ములనకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని, గంజాయి నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, గంజాయి కొన్న, సేవించిన, రవాణా చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.

 The District Police Is Cracking Down On Illegal Ganja In The District , Vemulaw-TeluguStop.com

జిల్లాలో గంజాయికి సంబంధించిన సమాచారం సబంధిత పోలీస్ కి డయల్ 100 కి సమాచారం అందించి గంజాయి రహిత జిల్లాగా మర్చడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.

యువత డ్రగ్స్( Drugs ) భారిన పది బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి అక్రమ గంజాయి రవాణాపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతున్నారని, 2024 సంవత్సరంలో ఈ రోజు వరకు జిల్లాలో 41 కేసులలో 99 మందిని అదుపులోకి 34 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

జిల్లాలో గంజాయి కి అలవాటు పడిన వారిని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి గంజాయి వలన కలుగు అనర్ధాలపైన ,ఒకసారి కేసుల పాలైతే జరిగే నష్టాల గురించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు.గంజాయి కి అలవాటు పడి మనుకోలేని స్థితిలో ఉన్నవారికోసం జిల్లాలో డి ఆడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ సమావేశంలో సి.ఐ లు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్ ఐ లు ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube