సోంపు( Fennel Seeds ).దీనిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
చాలా మందికి భోజనం చేసిన తర్వాత సోంపు తీసుకునే అలవాటు ఉంటుంది.సోంపు తీసుకోవడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుందని భావిస్తారు.
ఆ కారణంగానే భోజనం చేసిన వెంటనే సోంపు తింటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు తప్పక తెలుసుకోండి.భోజనం తర్వాత సోంపు తినడం వల్ల ఆహారం త్వరగా అరగడమే కాదు మరెన్నో ఆరోగ్య లాభాలు కూడా మీ సొంతం అవుతాయి.
సోంపు గింజల్లో ఫైబర్ తో పాటు యాంటిస్పాస్మోడిక్ గుణాలు మెండుగా ఉంటాయి.అందువల్ల సోంపు జీర్ణ క్రియను చురుగ్గా మారుస్తుంది.
భోజనం తర్వాత సోంపు గింజలను తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ( Acidity ), కడుపు మంట వంటివి తలెత్తకుండా ఉంటాయి.మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించే శక్తి పెరుగుతుంది.అలాగే నోటి దుర్వాసన సమస్య( Bad Breath )తో బాధపడే వారు ఎంతో మంది ఉన్నారు.అలాంటి వారికి సోంపు ఒక వరం అని చెప్పుకోవచ్చు.సోంపు బ్యాడ్ బ్రీత్ సమస్యను నివారిస్తుంది.
అదే సమయంలో నోటిలో పేరుకుపోయిన క్రిములు మరియు బ్యాక్టీరియాను తొలగిస్తుంది.సోంపులో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సోడియం, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.
అందువల్ల ఆరోగ్యానికి సోంపు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.సోంపును తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.
ఆస్తమా( Asthama ) మరియు ఇతర శ్వాసకోశ వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
బరువు తగ్గాలని( Weight Loss ) ప్రయత్నిస్తున్న వారికి సోంపు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.సోంపును నీటిలో వేసి బాగా మరిగించి.ఆ వాటర్ ను రెగ్యులర్ గా తీసుకుంటే బరువు తగ్గే ప్రక్రియ సులభతరం అవుతుంది.
ఇక పాలు ఇచ్చే తల్లులు కూడా సోంపును తీసుకోవచ్చు.బాలింతలు సోంపును డైట్ లో చేర్చు కోవడం వల్ల పాల ఉత్పత్తి చక్కగా పెరుగుతుంది.