విత్తన డీలర్లకు నకిలీలపై అవగాహన సదస్సు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల( Chendurthi ) కేంద్రంలోని రైతు వేదికలో శనివారం వ్యవసాయ శాఖ ( Department of Agriculture )ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు నకిలీ విత్తనాలపై అవగాహన సదస్సును వ్యవసాయ అధికారి సిహెచ్ దుర్గరాజు సమక్షంలో నిర్వహించారు.ఈ సందర్భంగా దుర్గరాజు మాట్లాడుతూ.

 Awareness Seminar On Counterfeiting For Seed Dealers-TeluguStop.com

రైతులకు ప్రభుత్వం ఆమోదం ఉన్న విత్తనాలు మాత్రమే విక్రయించారని కొనుగోలు చేసిన రైతులకు తప్పకుండా రసీదు ఇవ్వాలని రైతులు కూడా అట్టి రసీదులను భద్రపరుచుకోవాలన్నారు.నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోవడమే కాకుండా పంట చేతికి వచ్చే సమయానికి దిగుబడి రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోతారని అన్నారు.

విత్తన డీలర్లు అందరూ విత్తన రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు గ్రామాల్లో నకిలీ విత్తనాలు లేబల్ లేని ప్యాకెట్లతో విత్తనాలు క్రయవిక్రయాలు జరిగినట్టయితే పోలీసుల దృష్టికి, వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, చందుర్తి, రుద్రంగి మండలాల వ్యవసాయ విస్తరణ అధికారులు,విత్తన డీలర్లు, రైతులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube