Veernapalli Police Station : వీర్నపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి పోలీస్ స్టేషన్( Veernapalli Police Station ) ను జిల్లా ఎస్పీ అఖిల్( SP Akhil ) మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి,పోలీస్ స్టేషన్ లో గల పెండింగ్ కేసుల వివరాలు( Pending Cases ) తెలుసుకొని త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే అంశాలను అడిగి తెలుసుకున్నారు.

 Sp Sudden Inspection On Veernapalli Police Station-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా అధికారులు విధులు నిర్వహించాలని బ్లూకోట్స్‌ టీమ్‌లు 24 గంటలపాటు ముమ్మరంగా పెట్రోలింగ్‌ నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.లోక్ సభ ఎన్నికల( Loksabha Elections ) సందర్బంగా పోలీస్ స్టేషన్ సిబ్బందికి పలు సూచనలు చేసారు.

పోలీస్ అధికారులంతా , నిస్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని,పోలీస్ స్టేషన్ పరిధిలో గల పోలింగ్ కేంద్రాలను ప్రతి ఒక్కరు విధిగా సందర్శించి ఏమైనా లోటు ఉన్నట్లయితే వెంటనే పై అధికారులకు తెలపాలన్నారు.పోలీస్ సిబ్బందికి కేటాయించిన గ్రామాలను తరచు పర్యటిస్తూ గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

స్టేషన్ పరిధిలోగల సమస్యాత్మక , సున్నితమైన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలన్నారు.ఎస్పీ వెంట సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ రమేష్ ,సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube