ఫ్లెక్సీల తొలగింపు పై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం.

ఎందుకు తొలగించారంటూ అధికారులను నిలదీసిన నాయకులు.రాజన్న సిరిసిల్ల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల తొలగింపు పై కాంగ్రెస్ పార్టీ( Congress party ) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Congress Leaders Are Angry Over The Removal Of Flexi.-TeluguStop.com

శుక్రవారం ఫ్లెక్సీల తొలగింపు విషయం తెలుసుకున్న నాయకులు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్( Srinivas ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు.అనుమతి తీసుకొని కట్టిన ఫ్లెక్సీలను ఎందుకు తొలగించారంటూ అధికారులను నిలదీశారు.

అధికార పార్టీ ఫ్లెక్సీలు తొలగించకుండా కాంగ్రెస్ పార్టీ ప్లెక్సీలు ఎలా తొలగిస్తారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు.తొలగించిన ఫ్లెక్సీలను తిరిగి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తో పాటు నాయకులు డిమాండ్ చేశారు.

నిరసనలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సూరదేవరాజు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube