గులాబీ జెండా ను రెపరెపలాడించాలి అందుకు ప్రతి కార్యకర్త కష్టపడాలి

24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇప్పటివరకు లక్ష ముప్పై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చాం.రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్( B Vinod Kumar ).

 Every Activist Should Work Hard To Brs Party , B Vinod Kumar ,rajanna Sirisi-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా: డిసెంబర్ 3 న గులాబీ జెండాను రెపరెపలాడించాలనీ అందుకు ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టపడాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన మహనీయుడని అయన కొనియాడారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం మొదటగా పోలీసు స్టేషన్ ప్రక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ , నాస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య( Thota Agaiah ) , ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి ల తో కలిసి బుధవారం ప్రారంభించారు.అనంతరం ఎల్లారెడ్డిపేట స్టార్ ఫంక్షన్ హాల్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటివరకు 1,33,000 మందికి ఉద్యోగాలు కల్పించామని 83000 మందికి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగిందన్నారు.

పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధికారుల అవినీతి అక్రమాల వల్ల నియామకాలు నిలిపివేయడం జరిగిందన్నారు.తమ ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేస్తూ రేవంత్ రెడ్డి అమెరికాలో మాట్లాడుతూ రైతులకు మూడు గంటల కరెంటు మాత్రమే ఇస్తామనడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని గుర్తు చేశారు.గతంలో తెలంగాణ వ్యాప్తంగా కేవలం ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ 35 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం ఓ గొప్ప శుభ సూచకమని కొనియాడారు.విబేదాలుంటే ఎన్నీకలయ్యోదాకా ప్రక్కన బెట్టి ప్రతి కార్యకర్త , ప్రతి నాయకుడు కలిసికట్టుగా పనిచేస్తే గెలుపు మనదే నని భారీ మెజారిటీతో బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థి కేటీఆర్( KTR ) గెలుపు తథ్యమని అన్నారు.3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే బిఆర్ఎస్ పార్టీ కావాలా ఓటర్లను అడగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి గురించి ఓటర్ల కు వివరించి ఓట్లను అభ్యర్థించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ రేపటి నుంచి ప్రచారం ప్రారంభించాలని భూత్ కమిటీ ల ఆధ్వర్యంలో రూట్ మ్యాప్ లు సిద్దం చేసుకోవాలని ఆయన కోరారు.

అనంతరం నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు .టెక్స్టైల్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, మండల సర్పంచ్ లు ఫోరం మండల అధ్యక్షులు కొండాపురం బాల్ రెడ్డి , బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి, మాజీ జెడ్పిటిసి వడ్నాల నరసయ్య, ఏఎంసీ చైర్మన్ ఎల్సాని మోహన్ కుమార్, సీనియర్ నాయకులు అందే సుభాష్, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, మండల కో ఆప్షన్ మెంబెర్ జబ్బర్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube