రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు మైలారం రాము సుమారు 10 మందితో పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.వారికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు.పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం జరగాలన్న కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైతుందని తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీలో ఎంతో క్రియాశీకలంగా పనిచేస్తున్న సరైన గుర్తింపు దక్కలేదని అన్నారు.రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, డైరెక్టర్ వస్తాది కృష్ణ, నాయకులు చిలుక రమేష్, గుర్రం తిరుపతి, దూలం భూమేష్, సిరిగిరి శ్రీకాంత్, బాబున్, పోతారం రాజ బోస్, చేరినవారు చింతల తాడే0 దేవయ్య, చింతల తాడే0 శ్రీను, మల్లేశం, మర్రిపల్లి మైసయ్య , పోతారం రమేష్, రాజు తదితరులు పాల్గోన్నారు.