రాజన్న సిరిసిల్ల జిల్లా:కేంద్రం ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టినటువంటి బడ్జెట్ ప్రజల ఆంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందన్నారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సిరిసిల్ల మాజీ సెస్ చైర్మన్ అల్లాడి రమేష్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా రంజకమైనటువంటి ఈ బడ్జెట్ ద్వారా పేద, మధ్యతరగతి, రైతు, యువత, ఎస్సీ, ఎస్టీ మహిళలకు, విద్యారంగానికి ఐటీ రంగానికి 2027 వరకు ప్రపంచంలోనే భారత్ మూడో స్థానం చేరుకునేలా ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు.
రైతులకు 5 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డు, పీఎం ధన్ ధాన్య పథకం మధ్యతరగతి ఉద్యోగస్తులకు ఊరట లభించింది అని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా 75 వేల ఎంబిబిఎస్ సీట్లు, ఐఐటి సీట్ల పెంపు, ఇది వికాషిత్ భారత్ లక్ష్యంగా ప్రజా రంజకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టిన బిజెపి ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.