క్షేత్ర అధ్యయనంలో కొత్త విషయాలు నేర్చుకున్నాం : అల్ ఇండియా సర్వీసెస్ శిక్షణ అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా క్షేత్ర అధ్యయనంలో కొత్త విషయాలు నేర్చుకున్నామని అల్ ఇండియా సర్వీసెస్ శిక్షణ అధికారులు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి తెలిపారు.శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తో క్షేత్ర పర్యటనకు వచ్చిన అల్ ఇండియా సర్వీసెస్ శిక్షణ అధికారులు భేటీ అయ్యారు.

 New Things Learned In Field Study : All India Services Training Officers-TeluguStop.com

వారం రోజులపాటు అల్ ఇండియా సర్వీస్ శిక్షణ అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలంలోని నామపూర్, తంగళ్ళపల్లి మండలంలోని బస్వాపూర్, ఎల్లారెడ్డిపేట్ మండలంలోని రాజన్నపేట, వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లి గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజల సామాజిక, ఆర్థిక, జీవన పరిస్థితులు, సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించి అధ్యయనం చేశామని, క్షేత్ర స్థాయిలో వారు పరిశీలించిన కొన్ని ముఖ్యమైన అంశాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి వివరించారు.తమ శిక్షణలో భాగంగా పొందిన ఈ క్షేత్ర అనుభవం ఉద్యోగ విధుల నిర్వహణలో ఉపయుక్తంగా ఉంటుందని అల్ ఇండియా సర్వీసెస్ శిక్షణ అధికారులు తెలిపారు.

పల్లె ప్రగతి స్ఫూర్తితో, స్థానిక సంస్థల విభాగం కృషితో జిల్లాలోని పర్యటించిన గ్రామాలు అందంగా తీర్చిదిద్దబడి ఉన్నాయని అల్ ఇండియా సర్వీసెస్ శిక్షణ అధికారులు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ మదన్ మోహన్, ఏపీడీ నర్సింహులు, ఎంపీడీఓ లు చిరంజీవి, లచ్చాలు, రాంరెడ్డి, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube