ప్రసూతి మరణాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రసూతి మరణాలు జరగకుండా, రక్తహీనత లోపం ఉన్న గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి, వారికి సరైన పోషకాహారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 Rajanna Sircilla District Collector Anurag Jayanti On Maternal Mortality ,rajann-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఎనీమియా (రక్తహీనత లోపం) బారిన పడకుండా ఉండేందుకు సరైన పోషకాహారాన్ని అందించాలని అన్నారు.రక్తహీనత లోపం కలిగిన గర్భిణీ స్త్రీలకు అవసరమైన మందులు అందించాలని వైద్యారోగ్య శాఖ సిబ్బందికి కలెక్టర్ సూచించారు.ప్రత్యేకంగా ప్రసూతి మరణాలు సంభవించకుండా దృష్టి సారించాలని అన్నారు.7 గ్రాముల కంటే తక్కువ హిమోగ్లోబిన్ కలిగిన గర్భిణీ స్త్రీలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు 24 గంటల్లోగా చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి పంపించాలని అన్నారు.దీనిపై వైద్యుల బృందంతో కూడిన కమిటీ వేయాలని, ఈ కమిటీ గర్భిణీ స్త్రీ పరిస్థితిని పరిశీలించి మెరుగైన ఆరోగ్యంతో ఉందని ధృవీకరించిన తర్వాతే డిశ్చార్జి చేయాలని సూచించారు.సిజేరియన్ ప్రసవాలు జరగకుండా అడ్డుకట్ట వేయాలని, సాధారణ ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఈ సమీక్షలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.సుమన్ మోహన్ రావు, జిల్లా ఉప వైద్యాధికారులు డా.శ్రీరాములు, డా.రజిత, ఇమ్మ్యూనైజేషన్ అధికారి డా.మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube