రాజన్న సిరిసిల్ల జిల్లా :క్యాన్సర్ వ్యాధి పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ సూచించారు.శనివారం తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావుపల్లి గ్రామం లో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో వైద్యులచే క్యాన్సర్ వ్యాధి పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్ తదితర వాటికి దూరంగా ఉండాలన్నారు.వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్ నయం చేయవచ్చన్నారు.అదేవిధంగా చట్టాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు చింతోజ్ భాస్కర్, వైద్యులు రమేష్, లీలా శిరీష, న్యాయ సేవాధికార సభ్యులు ఆడేపు వేణు, మల్లేష్ యాదవ్, ఆంజనేయలు, అన్సార్ ఆలీ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.