అసెంబ్లీ ఎన్నికల తుది ఖర్చులు వివరాలు అభ్యర్థులు సమర్పించాలి..

రాజన్న సిరిసిల్ల జిల్లా: అసెంబ్లీ ఎన్నికల తుది ఖర్చులు వివరాలు అభ్యర్థులు సమర్పించాలనీ ఎన్నికల వ్యయ పరిశీలకులు జి.మణిగండసామి అన్నారు శుక్రవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హల్ లో సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ ఎన్నికల కు సంబంధించి అభ్యర్థుల అకౌంట్ రికన్సిలేషన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్నికల వ్యయ పరిశీలకులు జి.మణిగండసామి మాట్లాడుతూ అభ్యర్థుల తుది ఖర్చుల కు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు, తేడాలు ఉంటే జిల్లా వ్యయ మానిటరింగ్ కమిటీనీ సంప్రదించాలని చెప్పారు.

 Candidates Have To Submit Details Of The Final Expenses Of Assembly Elections G-TeluguStop.com

జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ… అభ్యర్థులు వచ్చే నెల 2 వ తేదీ లోగా తుది ఖర్చుల వివరాలను నిర్ణీత ప్రోఫార్మా లో సమర్పించాలని చెప్పారు.ఒకవేళ అభ్యర్థులు ఖర్చుల వివరాలు సమర్పించగా లేకపోతే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 10 (ఏ ) ప్రకారం అభ్యర్థులకు తదుపరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అవుతారని అన్నారు .ఈ సమావేశంలో ఎన్నికల వ్యయ ప్రత్యేక అధికారి స్వప్న, నోడల్ అధికారి రామ కృష్ణ , ఏఈవో లు, ఎన్నికల అకౌంటింగ్ టీమ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube