రైస్ మిల్లర్ల దోపిడీని ప్రభుత్వం అరికట్టాలి - సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అగ్రహారం గ్రామంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి. అనంతరం సిరిసిల్ల కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రైస్ మిల్లర్లు రైతులను దోపిడీ చేస్తున్నారని ప్రభుత్వం దీనిని అరికట్టాలన్నారు.

 Government Should Stop Exploitation Of Rice Millers Sirisilla Constituency Incha-TeluguStop.com

టాక్ రైస్ మిల్లర్లు తరుగు పేరుతో క్వింటాలుకు 8 కిలోల వడ్లను రైతులకు తూకంలో తగ్గించడం జరుగుతుందన్నారు.రైతులు వడగండ్ల వర్షాల మూలంగా తీవ్రంగా నష్టపోయి ఉంటే మరోపక్క రైతులను మిల్లర్లు దోచుకోవడం జరుగుతుందన్నారు.

వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతున్న ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల నుండి వడ్లను ప్రభుత్వం తరలించకపోవడం శోచనీయమన్నారు.

సిరిసిల్ల నియోజకవర్గంలో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంటే మంత్రి కేటీఆర్ అమెరికాలో ఫోటోలకు ఫోజులిచ్చుకుంటూ జల్సా చేయడం జరుగుతుందన్నారు.

రైతులను కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు.అనంతరం గ్రామస్తులు 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా కేకే మహేందర్ రెడ్డి వారికి కండువాలు కప్పి ఆహ్వానం పలికారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు మామిండ్ల కిషన్, నాయకులు షేక్ గౌస్ ,సద్ది లక్ష్మారెడ్డి ,మర్రి శ్రీనివాస్ రెడ్డి, లింగం గౌడ్, రాజేందర్, రాజు నాయక్,గండికోట రవి,చెరుకు ఎల్లయ్య,చెన్ని బాబు గ్రామస్తులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube