యాసంగి వరి ధాన్యం రాకను బట్టి కొనుగోలు కేంద్రాలను తెరవాలీ

రాజన్న సిరిసిల్ల జిల్లా : యాసంగి ధాన్యం రాకను బట్టి కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు .మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఐడిఓసి లోని తన ఛాంబర్ లో వడ్ల కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

 Yasangi Will Open Purchase Centers Depending On The Arrival Of Rice Grain , Yasa-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ…యాసంగి 2022-23 సీజన్ లో మూడు లక్షల నలబై వేల (3,40,000) మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.కనీస మద్దతు ధర గ్రేడ్ –ఏ రకం వరి ధాన్యానికి క్వింటాల్ కి 2060/- రూపాయలు, సాధారణ రకం వరి ధాన్యానికి క్వింటాల్ కి 2040/- రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని తెలిపారు.

మొత్తం 259 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ( ఐకేపి-47, పిఏసియస్-196, డిసిఎంఎస్-12, మెప్మా-4) ద్వారా కొనుగోళ్ళు సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని అన్నారు.దీనికి గాను సరిపడా గోనె సంచులు అందుబాటులో కలవు అని తెలియచేసారు.

ఈ సీజన్ లో వ్యవసాయ విస్తరణ అధికారులదే (ఎఈఓ ) ముఖ్య పాత్ర అని తెలిపారు.రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ తో శుభ్రపరిచిన తర్వాత ఎఫ్ ఏ క్యూ నిబంధనల ప్రకారం వ్యవసాయ విస్తరణ అధికారులు (ఎఈఓ ) ధ్రువీకరించిన తర్వాత, తూకం వేసి కేటాయించిన మిల్లుకు పంపించేలా చూడాలని తెలిపారు.

ధాన్యం రవాణా లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ధాన్యం రవాణా కాంట్రాక్టర్లను ఆదేశించామని , నిరంతరం 300 లారీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

వరి ధాన్యం రవాణా కాంట్రాక్టర్లతో ప్రతి కొనుగోలు కేంద్రమునకు 2 లేదా అంతకంటే ఎక్కువ వాహనములను ఖచ్చితంగా సమకూర్చవలెను అని ఆదేశించారు.

జిల్లా లో ఉన్న మిల్లర్లూ వారి యొక్క మిల్లులలో సరిపడా హమాలీలను అందుబాటులో ఉంచుకొని వెంట వెంటనే ధాన్యం దిగుమతి చేసుకొని ధాన్యం దిగుమతి కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మిల్లర్లే భాద్యత వహించాలి అని మిల్లర్లకు ఆదేశించినరు.జిల్లా మార్కెటింగ్ అధికారి గారికి ప్రతి కొనుగోలు కేంద్రమునకు టార్పలేన్లు , మైచర్ మీటర్ , ప్యాడి క్లీనర్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించినారు.

ఈ యసంగి లో కొనుగోలు కేంద్రములో అరబోసిన వరి ధాన్యం అకాల వర్షాల కారణంగా పాడవకుండా ప్రతి కొనుగోలు కేంద్రముల వారు అలాగే రైతులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.మిల్లర్లు నుంచి సీఎంఆర్‌ను పూర్తి స్థాయిలో సేకరించాలని అధికారులను ఆదేశించారు.

సీఎంఆర్‌ అప్పగించే విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఉపేక్షించబోమని అన్నారు.ఈ సమావేశంలో డిఎస్ సి ఓ జితేందర్ రెడ్డి , డి ఎం సి ఎస్ సి జితేంద్ర ప్రసాద్ , జిల్లా రవాణా అధికారి కొండల్ రావు , డి ఎ ఓ రణధీర్ రెడ్డి , జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ , రవాణా కాంట్రాక్టర్లు , మిల్లర్ల ప్రతినిదులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube