మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల శాఖ కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల శాఖ, స్వేరోస్ అధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి.ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు నీరటి భాను, స్వేరోస్ నాయకులు లింగాల సంధీప్ మాట్లాడుతూ భారతదేశపు మొట్టమొదటి స్త్రీవాది జ్యోతి రావు పూలే.

 196th Birth Anniversary Celebrations Of Mahatma Jyotirao Phule, Jyotirao Phule ,-TeluguStop.com

నా స్త్రీ స్వాతంత్రమర్హతే అన్న కుట్రను గుర్తించి స్త్రీలకు అక్షర జ్ఞానాన్ని అందించిన దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే.బ్రాహ్మణీయ ధర్మశాస్త్రకర్తలు స్త్రీల పట్ల దురుద్దేశంతో స్వార్థంతో విద్యకు దూరం చేసేందుకు స్త్రీ విద్య అనర్ధదాయకమని,మహా పాపమని, స్త్రీ చదువుల పట్ల పురుషులకు ఆయుక్షణం అనే మూఢ ప్రచారాలను కొనసాగిస్తున్న కాలంలో మనము చెసేది అబద్ధం నమ్మకండి,భయపడకండి,స్త్రీలంతా చదువుకోండి మీకు నేను అండగా ఉంటాను అని ధైర్యాన్ని చెప్పారు.

స్వయంగా తన భార్య సావిత్రిబాయి పూలే కు విద్య నేర్పి మొదటి ఉపాధ్యాయురాలిగా చేసి స్త్రీ విద్యకు కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త.విద్య లేనందున జ్ఞానం లేకుండా పోయింది,జ్ఞానం లేనందున నైతికత లేకుండా పోయింది,నైతికత లేనందున ఐకమత్యం లేకుండా పోయింది,ఐకమత్యం లేనందున శక్తి లేకుండా పోయింది,శక్తి లేనందున శూద్రులు అణచివేయబడ్డారు.

ఇన్ని అనర్ధాలు కేవలం విద్య లేకపోవడం వల్లే జరిగాయి అని శూద్రులకు దిశా నిర్దేశం చేసినటువంటి గొప్ప సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే అన్నారు.

ఆయన బాటలోనే ఆయన ఆలోచన విధానంతోటే భోజనం సమాజ్ పార్టీ ఎల్లప్పుడు నడుస్తుందని ఆయన ఆశల కోసం పనిచేస్తుందని ఈ జయంతి సందర్భంగా తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు న్యాలకంటి లక్ష్మీరాజ్యం, కో కార్యదర్శి కోప్పెల్లి రాజు, కార్యదర్శులు అందె ఈశ్వర్, గునుగంటి చిరంజీవి, సోషల్ మీడియా ఇంచార్జ్ గడ్డమీది సాయిచంద్,మండల యువ నాయకుడు నవీన్ భాయ్, మండల నాయకులు బండి బాబు, బండి ప్రవీణ్, బన్ని, శ్రీకాంత్, అజిత్, పర్షరాములు, సాగర్ తదితరులు పాల్గోన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube