జాతీయ నూలి పురుగుల నివారణ, విటమిన్ ఏ మానసిక ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయములో ఇంచార్జీ వైద్య,ఆరోగ్య శాఖ అధికారిణి డా.ఎస్.రజిత( Dr.S.Rajita ) ఆద్వర్యములో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు, ఆర్.బి.ఎస్.కె సిబ్బందికి ఏర్పాటు చేసిన సమావేశములో జాతీయ నూలి పురుగుల నివారణ, విటమిన్ – ఏ, మానసిక ఆరోగ్యము కార్యక్రమమాలపై గురించి మాట్లాడుతూ ఫిబ్రవరి 12 వ తేదిన ప్రారంభమైయ్యే జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవము సందర్భముగా జిల్లాలోని 1-19 సం.లోపు పిల్లలందరికి ఆలబెండజొల్ మాత్రలు వేయించాలని, ఫిబ్రవరి 17వ తారీఖు మోప్ అప్ డే రోజున మిగిలిపోయిన పిల్లలందరికి ఆలబెండజొల్ మాత్రలు వేయించాలని తెలియజేశారు.మానసిక ఆరోగ్యము గురించి డా.ప్రవీణ్ కుమార్ జిల్లా ఆసుపత్రి వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు క్లుప్తముగా వివరించి ప్రజలలో అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమములో డిప్యుటి డి.ఏం.హెచ్.ఓ డా.బి.శ్రీరాములు, డా.నయీమా ప్రోగ్రామ్ అధికారి ఆర్.బి.ఎస్.కె.సి.హెచ్.ఓ లు ప్రతాపరెడ్డి, సత్యనారాయణ, శ్రీనివాస్, హెచ్.

 National Worm Prevention, Vitamin A Mental Health Awareness Programme , Vitamin-TeluguStop.com

యీ బాలయ్య తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube