ప్రభుత్వ భూముల వివరాలు పక్కాగా ఉండాలి

ఆక్రమణ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి వేసవిలో నీటి సమస్య రాకుండా చర్యలు జిల్లా అధికారులతో సమీక్షలో కలెక్టర్ అనురాగ్ జయంతి( Collector Anurag Jayanthi ) రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో గల ప్రభుత్వ భూముల వివరాలు పక్కాగా ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

 Details Of Government Lands Should Be Accurate , Government Lands, Accurate , C-TeluguStop.com

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ భూముల వివరాలు పక్కాగా ఉండాలని సూచించారు.ఖాళీ స్థలాలు ఎన్ని ఎకరాలు ఉన్నాయో రికార్డ్స్ లో ఉండాలని, వాటిపై తనిఖీ చేయాలని, ఆక్రమణలు ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అట్టి భూములను విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలకు అవసరమయ్యే భవనాల నిర్మాణాలకు వినియోగించాలని పేర్కొన్నారు.’నీటి శుద్ధి నుంచి.ఇంటింటికీ సరఫరా వరకు.జిల్లాలోని మున్సిపాలిటీలు, అన్ని మండలాల పరిధిలోని గ్రామాల్లో రానున్న వేసవిలో నీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

నీటి శుద్ది నుంచి మొదలు ఇంటింటికీ సరఫరా వరకు క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని వివరాలతో కూడిన సమగ్ర నివేదికను అందించాలని కలెక్టర్ ఆదేశించారు.శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలపై ఆరా తీశారు.నీటి సరఫరా, సమస్యల పరిశీలనకు జిల్లా అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు.”టెక్స్ టైల్ పార్క్ పై ఆరా.’సిరిసిల్ల లోని టెక్స్ టైల్ పార్క్ లో ఎన్ని పరిశ్రమలు అనుమతి పొందాయి? ప్రస్తుతం ఎన్ని కొనసాగుతున్నాయి అనే వివరాలు టెక్స్ టైల్ పార్క్ ఆర్డీడీ అశోక్ రావు ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.టెక్స్ టైల్ పార్క్ లో మొత్తం 116  పరిశ్రమలు అనుమతి పొందాయని, ప్రస్తుతం 62 కొనసాగుతున్నాయని జేడీ తెలిపారు.

మిగతా పరిశ్రమలు వివిధ కారణాలతో మూతపడ్డాయని వివరించారు.అనంతరం శ్రీ రాజరాజేశ్వర జలాశయం వద్ద చేప పిల్లల పెంపకం, దానికి కావాల్సిన స్థలం, ఇతర అంశాలపై వివరాలు ఆ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో గల ప్రతీ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో 2014 నుండి ఇప్పటివరకు ఎన్ని పనులు మంజూరయ్యాయి, ఎన్ని పూర్తయ్యాయి అనే సమగ్ర వివరాలను సమకూర్చి తనకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.అలాగే తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ శివారులో చేపడుతున్న కేంద్రీయ విద్యాలయం నూతన భవన నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు.

ఎంత మేరకు నిర్మాణం పూర్తయింది? ఎప్పటివరకు పూర్తి చేస్తారు? అనే వివరాలను ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు.జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో క్రిటికల్ కేర్ యూనిట్, క్వార్టర్ల నిర్మాణాలకు కావాల్సిన భూములను సేకరించాలని, పనులు త్వరగా పూర్తి చేయాలని సిరిసిల్ల ఆర్డీఓను ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఎన్.ఖీమ్యా నాయక్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధుసూధన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగయ్య, టెక్స్టైల్ పార్క్ ఆర్డీడీ అశోక్ రావు, మిడ్ మానేర్ ఈఈ జగన్, జౌళి శాఖ ఏడీ సాగర్, ఇంట్రా ఈఈ జానకి, గ్రిడ్ ఈఈ విజయ్ కుమార్, చీఫ్ ప్లానింగ్ అధికారి పి.బి.శ్రీనివాస చారి, జిల్లా పంచాయితీ అధికారి రవీందర్, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, ఆర్&బి ఈఈ శ్యామ్ సుందర్, మత్స్య శాఖ అధికారి శివప్రసాద్, ఇరిగేషన్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధి కల్పనా అధికారి రాఘవేందర్, మున్సిపల్ కమీషనర్లు అయాజ్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube