నాభీ( navel ) లేదా బొడ్డును మన రెండవ మెదడు అని అంటారు.ప్రకృతి వైద్యంలో నాభిని శక్తి కేంద్రంగా కూడా వర్ణించారు.
తల్లి గర్భంలో బిడ్డ పెరుగుతున్నప్పుడు ఈ నాభి ద్వారానే శిశువు మనుగడగకు పోషకాలు అందుతాయి.అయితే ఈ నాభికి నెయ్యిని పూయాలని( ghee ) పురాతన వైద్యం చెబుతోంది.
అలాగే ఆయుర్వేదం ప్రకారం నాభి అనేది ప్రాణమైతే దానికి నెయ్యి ఆ శక్తిని అందిస్తుంది.ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథాలు సుశ్రుత సంహితలో పేర్కొన్నట్టుగా, దేశీ నెయ్యి అపారమైన ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది.
అయితే నాభికి నెయ్యి పూయడం వలన జీవశక్తి లభిస్తుంది.అంతేకాకుండా అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
ప్రతి రాత్రి నెయ్యి నిద్రపోయే ముందు నాభికి పూయాలి.
ఆ తర్వాత బొడ్డును సున్నితంగా మసాజ్ చేయాలి.ఇలా చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.అవి ఎలాంటి ప్రయోజనాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే నాభికి నెయ్యి పూయడం వలన బొడ్డును శుభ్రం చేయడం వలన నాభిలో పేరుకుపోయి ఉన్న మురికి, బ్యాక్టీరియా( Dirt, bacteria ) మొత్తం తొలగిపోతుంది.ఇది పొట్ట, నాభి ప్రాంతాలను ఏవైనా అనారోగ్య సమస్యలు రాకుండా దూరంగా చేస్తాయి.
నాభికి నెయ్యి పూయడం వలన కూడా నెయ్యి పొట్ట వరకు పోతుంది.దీంతో కడుపు అన్ని పోషకాలను గ్రహిస్తుంది.
వాటిని శరీరంలో పంపిణీ చేస్తుంది.ఇక పేగు మార్గాన్ని కూడా క్లియర్ చేస్తుంది.మలబద్ధకంతో బాధపడుతున్న వారికి కూడా మంచి ఫలితం ఉంటుంది.ఇది కడుపులో యాసిడ్ స్రావానికి కూడా సహాయపడుతుంది.అంతేకాకుండా ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడానికి కూడా సహాయపడుతుంది.నాభికి నెయ్యితో మర్దన చేయడం వలన ముఖానికి, చర్మానికి చాలా మేలు జరుగుతుంది.
నాభికి నెయ్యి పూయడం వలన చర్మం పై నల్లని మచ్చలను కూడా నయం చేస్తుంది.అంతేకాకుండా ప్రకాశవంతమైన, మృదువైన ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది.