భారత సంతతికి చెందిన బ్రిటీష్ మాజీ హోంమంత్రి ప్రీతి పటేల్‌కు( Priti Patel ) కీలక పదవి దక్కింది.కొత్తగా కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎంపికైన కెమీ బాడెనోచ్( Kemi Badenoch ) తన షాడో ఫారిన్ సెక్రటరీగా( Shadow Foreign Secretary ) ఆమెను నియమించారు.
టోరీ చీఫ్, విపక్షనేతగా రిషి సునాక్ స్థానంలో బరిలో నిలిచిన పోటీదారులలో ప్రతీ పటేల్ కూడా ఒకరు.ఈమెతో పాటు ఎన్నికల్లో తనకు ప్రత్యర్ధులుగా నిలిచిన రాబర్ట్ జెన్రిక్‌ను షాడో జస్టిస్ సెక్రటరీ, మెల్ స్ట్రెడ్‌ను షాడో ఛాన్సలర్‌గా నియమించారు బాడెనోచ్.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో గ్రూపులుగా విడిపోయిన కన్జర్వేటివ్ పార్టీని( Conservative Party ) ఏకం చేసేందుకు బాడెనోచ్ ఈ నిర్ణయం తీసుకున్నారని బ్రిటీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.కొద్దిరోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో దారుణ పరాజయంతో పార్లమెంట్‌లో టోరీల బలం 121కి పడిపోయింది.
దీంతో బాడెనోచ్ ప్రతిపక్ష నాయకురాలిగా తన షాడో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు.
లండన్‌లోనే జన్మించిన ప్రీతి తల్లిదండ్రుల స్వస్థలం గుజరాత్.( Gujarat ) వారు మొదట ఉగాండాలో నివసించేవారు.అయితే, ఉగాండాలో అప్పుడున్న పాలకుడు దక్షిణాసియాకు చెందినవారిపై దేశ బహష్కరణ విధించారు.
దీంతో ప్రీతి తల్లిదండ్రులు బ్రిటన్‌కు వలసవచ్చారు.వైట్‌ఫోర్డ్ గ్రామర్ స్కూల్, వెస్ట్‌ఫీల్డ్ టెక్ కాలేజ్, కీల్ వర్సిటీ, ఎసెక్స్ విశ్వవిద్యాలయాల్లో ప్రీతి చదువుకున్నారు.20 ఏళ్లు కూడా నిండకముందే ప్రీతి కన్జర్వేటివ్ పార్టీలో చేరారు.
కన్జర్వేటివ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉద్యోగినిగా సేవలందించారు.1995 నుంచి 1997 వరకూ జేమ్స్ గోల్డ్‌స్మిత్ నేతృత్వంలోని రెఫరెండమ్ పార్టీకి ప్రతినిధిగా ఉన్నారు.ఆ పార్టీ యురోపియన్ యూనియన్‌ను వ్యతిరేకించింది.
డేవిడ్ కేమరూన్ హయాంలో ఏడాదిపాటు ట్రెజరీ శాఖలో సహాయమంత్రిగా, మరో ఏడాది ఉద్యోగకల్పన శాఖలో మంత్రిగా ఆమె పనిచేశారు.రిషి సునాక్ కేబినెట్‌లో హోంశాఖ మంత్రిగా ప్రీతి పటేల్ సేవలందించారు.
హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రతిపక్షనేత పదవి కోసం ప్రీతి పటేల్ బరిలో నిలిచారు.తాజా ఎన్నికల్లో టోరీలు దారుణ పరాజయాన్ని మూటగట్టుకుని.విపక్షంలో నిలిచారు.విపక్షనేత ఎన్నిక జరిగే వరకు మాజీ ప్రధాని రిషి సునాక్ తాత్కాలిక ప్రతిపక్షనేతగా వ్యవహరించారు.
నవంబర్ 2న పార్టీ నిర్వహించిన ఎన్నికల్లో కెమీ బాడెనోచ్‌ను కన్జర్వేటివ్‌లు విపక్షనేతగా ఎన్నుకున్నారు.