క సినిమా( Ka Movie ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గ నిలవడంతో పాటు కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) మార్కెట్ ను పెంచింది.క ఇతర రాష్ట్రాల్లో రిలీజ్ కానుండానే మేకర్స్ కు మంచి లాభాలను అందించింది.
అయితే క సినిమా తెలుగు వెర్షన్ చెన్నైలోని( Chennai ) థియేటర్లలో రిలీజ్ కాకపోవడంపై కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందె.అయితే కిరణ్ అబ్బవరం కష్టానికి తగ్గ గుర్తింపు దక్కిందనే చెప్పాలి.
చెన్నైలో క తెలుగు వెర్షన్ మాయాజల్ మల్టీప్లెక్స్ లో( Mayajal Multiplex ) రేపటి నుంచి ప్రదర్శితం కానుంది.కిరణ్ అబ్బవరం నిర్దేశించుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధిస్తున్నారంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
క సినిమా కలెక్షన్ల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు హ్యాపీగా ఉన్నారు.ఈ సినిమా కాన్సెప్ట్ కు యూత్ ఫిదా అవుతున్నారు.
ఈ సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయాయని చెప్పవచ్చు.క సినిమా కిరణ్ అబ్బవరం రేంజ్ ను పెంచడంతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది.కిరణ్ అబ్బవరం తర్వాత సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి.కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కిరణ్ అబ్బవరం క సినిమాతో ఇతర భాషల్లో ఏ రేంజ్ రెస్పాన్స్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది.కిరణ్ అబ్బవరంకు సోషల్ మీడియాలో సైతం క్రేజ్ పెరుగుతోంది.గతంలో కిరణ్ అబ్బవరంను ట్రోల్ చేసిన వాళ్లు ఇప్పుడు ఆయన ప్రతిభను మెచ్చుకుంటూ చేస్తున్న పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.క సినిమాకు గతంతో పోల్చి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.