అసెంబ్లీ ఎన్నికల తుది ఖర్చులు వివరాలు అభ్యర్థులు సమర్పించాలి..

రాజన్న సిరిసిల్ల జిల్లా: అసెంబ్లీ ఎన్నికల తుది ఖర్చులు వివరాలు అభ్యర్థులు సమర్పించాలనీ ఎన్నికల వ్యయ పరిశీలకులు జి.

మణిగండసామి అన్నారు శుక్రవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హల్ లో సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ ఎన్నికల కు సంబంధించి అభ్యర్థుల అకౌంట్ రికన్సిలేషన్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్నికల వ్యయ పరిశీలకులు జి.మణిగండసామి మాట్లాడుతూ అభ్యర్థుల తుది ఖర్చుల కు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు, తేడాలు ఉంటే జిల్లా వ్యయ మానిటరింగ్ కమిటీనీ సంప్రదించాలని చెప్పారు.

జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ.అభ్యర్థులు వచ్చే నెల 2 వ తేదీ లోగా తుది ఖర్చుల వివరాలను నిర్ణీత ప్రోఫార్మా లో సమర్పించాలని చెప్పారు.

ఒకవేళ అభ్యర్థులు ఖర్చుల వివరాలు సమర్పించగా లేకపోతే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 10 (ఏ ) ప్రకారం అభ్యర్థులకు తదుపరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అవుతారని అన్నారు .

ఈ సమావేశంలో ఎన్నికల వ్యయ ప్రత్యేక అధికారి స్వప్న, నోడల్ అధికారి రామ కృష్ణ , ఏఈవో లు, ఎన్నికల అకౌంటింగ్ టీమ్ తదితరులు పాల్గొన్నారు.

ఫ్యాన్స్ కు భోజనం వడ్డించిన స్టార్ హీరో విక్రమ్.. మంచి మనస్సును చాటుకున్నారుగా!