ప్రైవేట్ పాఠశాల నుండి ప్రభుత్వ బడికి - బడి ప్రారంభమైన రోజే పాఠశాలలో చేరిక

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రైవేట్ పాఠశాల లు వద్దు … ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అనే నినాదం తో ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను చేర్చాలని కోరుతూ ఎల్లారెడ్డి పేట ఉపసర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ దంపతులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.దాంట్లో భాగంగానే ఎల్లారెడ్డిపేట కు చెందిన దీటి హర్షిని మండలకేంద్రంలోనీ ఓ ప్రైవేట్ పాఠశాల లో ఐదవ తరగతి వరకు చదువుకుంది.

 From Private School To Government School Joining The School On The Day School St-TeluguStop.com

ఆరవ తరగతి లో సకల హంగుల తో మంత్రి కేటిఆర్ ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పాఠశాలలో చేర్పించాలని ఉపసర్పంచ్ దంపతులు విద్యార్థిని తల్లిదండ్రులు దీటి బాల్ లక్ష్మి – సతీష్ లకు సూచించగా సోమవారం హర్షిని 6వ తరగతి లో అడ్మిషన్ పొందింది.కాగా ప్రభుత్వ పాఠశాలలలో తన కూతురును చేర్పించినందుకు హర్శిని తల్లి బాల్ లక్ష్మి నీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ దంపతులు శాలువా కప్పి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ముత్యాల శ్రీనివాస్ రెడ్డి,గరుగుల స్వామి,గరుగుల కృష్ణహారి లు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube