మవారం భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జన్మదిన సందర్భంగా జిల్లా జాగృతి కో కన్వీనర్ వరుద సతీష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం భారత జాగృతి అధ్యక్షురాలు కవితపై కక్ష కట్టి ఈడీలతో వేధిస్తుందని ఆరోపించారు.
ఈడీలకు బోడీలకు భయపడేది లేదని ప్రజల కొరకు నిరంతరం పనిచేస్తున్న బి ఆర్ ఎస్ ప్రభుత్వమని ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని బిజెపికి ప్రత్యామ్నాయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు.