సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ( ఆన్లైన్) ద్వారా ముందస్తుగా దరఖాస్తుల పరిశీలన 4 దశలలో ఎల్.ఆర్.
ఎస్ దరఖాస్తుల స్క్రూటినీ పూర్తి ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల స్క్రూటినీ కొరకు ప్రత్యేక బృందాల ఏర్పాటు రాబోయే 3 నెలలో ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి ఎల్.ఆర్.ఎస్ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన డిప్యూటీ సీఎం, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్రంలో నాన్ లేఅవుట్ భూముల క్రమబద్దికరణ కోసం దరఖాస్తు చేసుకున్న లేఔట్ ఎల్.ఆర్.ఎస్.ప్రక్రియ మార్చి 2025 నాటికి పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.శనివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి భూపాల్ పల్లి జిల్లా ఐ.డి.ఓ.సి నుంచి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దానకిషోర్ ముందస్తుగా ఎల్.ఆర్.ఎస్ పథకం కింద వచ్చిన దరఖాస్తులు, వాటి ప్రస్తుత స్థితిగతులు, ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియ పూర్తి చేసేందుకు నిర్దేశించుకున్న ప్రణాళిక మొదలగు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల సంబంధించి అనుసరించాల్సిన విధానం పై ప్రభుత్వం సంబంధిత అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించి, న్యాయపరమైన దరఖాస్తుల రెగ్యులరేషన్ ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించామని అన్నారు.ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల స్క్రూటినీ సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సపోర్ట్ సిస్టం అధికారులకు పూర్తి స్థాయిలో అందిస్తామని అన్నారు.2020 నాటి ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పై ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రభుత్వానికి నష్టం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం తెలిపారు.
ఎల్.
ఆర్.ఎస్ ప్రక్రియ ద్వారా ఎక్కడ ప్రభుత్వ భూమికి నష్టం కలగ వద్దని, అదే విధంగా నీటి వనరులు, కాలువలు చెరువుల ఆక్రమణలకు పాల్పడలద్దని అధికారులకు సూచించారు.ఎల్.ఆర్.ఎస్ సంబంధించి దాదాపు 20 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని , వీటి స్క్రూటినీ నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం స్క్రూటినీ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పై జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపించి సకాలంలో పూర్తి చేయాలని , దీనికి సంబంధించి అవసరమైన సహాయ సహకారాలు రాష్ట్ర స్థాయి నుంచి అందించడం జరుగుతుందని అన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్.ఆర్.ఎస్ 2020 క్రింద 25 లక్షల 70 వేల 708 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో ఇప్పటి వరకు 4 లక్షల 28 వేల 832 దరఖాస్తుల స్క్రూటినీ చేసి 60 వేల 213 దరఖాస్తుల ఆమోదించి సదరు భూముల క్రమబద్దికరణ చేశామని అన్నారు.ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న దాదాపు 20 లక్షలకు పైగా ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల స్క్రూటినీ ప్రారంభించాలని, 4 దశలలో ఎల్.ఆర్.ఎస్ స్క్రూటిని ఉంటుందని మంత్రి తెలిపారు.ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల స్క్రూటినీ కోసం జిల్లా కలెక్టర్లు వారి పరిధిలోని ప్రతి గ్రామానికి, మున్సిపాలిటీకి రెవెన్యూ ఇన్స్పెక్టర్, నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్లు వివరాలు సమర్పించాలని అన్నారు.
ఎల్.
ఆర్.ఎస్ దరఖాస్తులను ముందుగా సి.జి.జి (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ద్వారా ఆన్ లైన్ లో ఫీల్టర్ చేసి, ధరణి ప్రొహిబిటెడ్ జాబితాలోని ఆస్తుల సర్వే నెంబర్ లతో చెక్ చేసి 2 లక్షల 5 వేల 562 దరఖాస్తులను గుర్తించి సదరు దరఖాస్తుదారులకు సమాచారం అందించడం జరిగిందని మంత్రి తెలిపారు.మిగిలిన ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను సంబంధిత అధికారులకు స్కూటీనీ కోసం పంపామని పేర్కొన్నారు.ఎల్.ఆర్.ఎస్ మొదటి దశలో సర్వే నెంబర్ వారీగా సంబంధిత రెవెన్యూ గ్రామం/మున్సిపాలిటీ లలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన బృందానికి దరఖాస్తులు చేరుతాయని అన్నారు.ఈ బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసి జిపిఎస్ ద్వారా సదరు భూమి కో ఆర్డినేట్స్ పక్కాగా నమోదు చేస్తారని, అదే సమయంలో ఈ భూములు నీటి వనరుల బఫర్ జోన్ ,నాలా, చెరువులు ,హెరిటేజ్ బిల్డింగ్ ,డిఫెన్స్ ల్యాండ్ పరిధిలోవి కావని ధ్రువీకరించాలని అన్నారు.ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల ధ్రువీకరణ కోసం ఆగస్టు మొదటి వారం నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి రాబోయే 3 నెలల వ్యవధిలో ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని , ఈ బృందాలు ఫీల్డ్ వెరిఫికేషన్ సకాలంలో చేసే విధంగా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.ఎల్.ఆర్.ఎస్ రెండవ దశలో సదరు దరఖాస్తులు స్థానిక సంస్థల నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా, రోడ్డు వెడల్పు ఓపెన్ స్పేస్ మొదలగు నిబంధనలు లేఔట్ లో పాటించారా అనే అంశాన్ని పరిశీలించి టౌన్ ప్లానింగ్ అధికారి ఆమోదిస్తారని, వెంటనే ఎల్.ఆర్.ఎస్ సంబంధించిన ఫీజు జనరేట్ అవుతుందని దీనిని దరఖాస్తుదారులకు తెలియజేయాలని, ఎల్.ఆర్.ఎస్ ఫీజు చెల్లించిన తర్వాత మూడో దశకు దరఖాస్తులు వెళ్తాయని అన్నారు.
ఎల్.
ఆర్.ఎస్ రెండవ దశ పూర్తి చేసిన దరఖాస్తులలో నుంచి 1% దరఖాస్తులను యాదృచ్ఛికంగా డిప్యూటీ తహసిల్దార్ కి పంపి క్రాస్ చెక్ చేయాలని, ఈ ప్రక్రియ పక్కాగా జరిగే విధంగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.మూడవ దశలో ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ , హైదరాబాద్ జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ పరిధిలోని సిటీ ప్లానర్స్ డైరెక్టర్స్ పరిశీలించి ధ్రువీకరిస్తారని, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని గ్రామపంచాయతీలలోని దరఖాస్తులను సైతం అదనపు కలెక్టర్ ధ్రువీకరిస్తారని, అదనపు కలెక్టర్ ధ్రువీకరణతో ఎల్.ఆర్.ఎస్ ప్రో సీడింగ్ జారీ అవుతాయని మంత్రి తెలిపారు.ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ సజావుగా నిర్వహించేందుకు బృందాలకు అవసరమైన శిక్షణ అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టరేట్, మున్సిపాలిటీ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాల్లో ఎల్.ఆర్.ఎస్ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.ఎల్.ఆర్.ఎస్ సంబంధించి జిల్లా మండల మున్సిపల్ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించే దరఖాస్తుదారులకు ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియను వివరించాలని, ఎల్.ఆర్.ఎస్ కింద ఉన్న దరఖాస్తులను మార్చి 2025 నాటికి పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఆదే శగా అధికారులు పనిచేయాలని మంత్రి ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డి.పి.ఓ.వీర బుచ్చయ్య, మున్సిపల్ కమిషనర్లు , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.