రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 112 దరఖాస్తులు వచ్చాయి.కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్( Additionalcollector n khimya naik ) మాట్లాడారు.ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.
రెవెన్యూ శాఖకు 69, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి 16, ఉపాధి కల్పన శాఖకు 8, డీపీఓ కార్యాలయానికి 4, డీసీసీడీఓ కు 3, డీఎంహెచ్ఓ కార్యాలయానికి 2, కోనరావుపేట, ఎలారెడ్డిపేట, బోయినపల్లి ఎంపీడీఓ కార్యాలయాలకు, వేములవాడ మున్సిపల్ కార్యాలయం, అటవీ శాఖ, వ్యవసాయ శాఖ, ఎల్డీఎం, ఎస్డిసీ, డీబీసీడీఓ, వైద్య శాఖకు ఒకటి చొప్పున దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు.ఇక్కడ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.