రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉంది ఎస్ ఆదుకుంటాం - దొమ్మటి నరసయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా: వడగళ్ల వర్షాల వల్ల రైతులకు కొంత నష్టం జరిగిన మాట వాస్తవమే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వందేనని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రైతులకు ఎకరాన పదివేల రూపాయల చొప్పున ఇస్తామని అందరికంటే ముందుగానే ప్రకటించి అధికారులను పంట పొలాలను పరిశీలించి నష్టం అంచనా వేయాలని ఆదేశించారని వారు గుర్తు చేశారు.

 Our Congress Government Has The Responsibility To Support The Farmers Dommati Na-TeluguStop.com

పొలం బాట పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని తెలంగాణలో రైతులను చాలా మట్టుకు మోసం చేసింది ఎవరంటే కెసిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వమే నని అన్నారు

కెసిఆర్ లెక్క ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చెప్పడం అయనకే సాద్యమని కాంగ్రెస్ ప్రభుత్వం నీతి నిజాయితీగా మాట్లాడుతుందన్నారు.గత వర్షాకాలంలో వర్షపాతం తక్కువగా ఉన్నదనే విషయం కెసిఆర్ తో పాటు మనందరికీ తెలుసు సుందిళ్ల మెడిగడ్డ కాలేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయి 60 టీఎంసీల నీరు సముద్రం పాలు చేసిన ఘనత కేసిఆర్ దేనని మధ్య మానేరుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అందులో ఉన్న నీటిని 12 13 ప్యాకేజీ కాలువల ద్వారా సిద్ధిపేట మెదక్ కు నీ ఫామ్ హౌస్ కు తీసుకపోతివి , నీ కొడుకు మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలోని 9వ ప్యాకేజీ మల్కపేట రిజర్వాయర్ పనులు పూర్తి చేయకపోగా అక్కడే పడావు చేస్తిరి ఈ విధంగా అయ్యా కొడుకులు చేసిన తప్పుకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నిందించడం సిగ్గుచేటు అనే విషయం అని వారు అన్నారు.

బిఆర్ ఎస్ ప్రభుత్వ హయంలో వడగళ్ల వాన వల్ల నష్టపోయిన పంటలకు వర్షాలకు కొట్టుకపోయి ఎండలకు ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి వీఆర్ఏ వీఆర్వోల చేత నష్ట పరిహారం అంచనా వేసి కాగితాలకే పరిమితం చేసి ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని వారు తీవ్రంగా విమర్శించారు.మా ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అయింది పకృతి వైపరీత్యాల వలన రైతులు కొంతవరకు నష్టపోయిన మాట వాస్తవమే తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎకరాన పదివేల రూపాయల నష్టపరిహారం రైతులకు ఇస్తామని ప్రకటించారని రైతులం తప్పకుండా ఆదుకుంటామన్నారు.

పార్లమెంట్ ఎన్నికల కోసం బిఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలు వేసి ఆర్భాటం కోసం పొలం బాట పట్టిందే తప్ప రైతులకు వారు చేసేది ఏం లేదని అన్నారు.పోన్ ట్యాపింగ్ ప్రాజెక్టు నిర్మాణాల లోపం పలు అవినీతి ఆక్రమాల విషయంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు జైలుకు వెళ్లడం ఖాయమని వారు హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు పందిళ్ళ లింగం గౌడ్, నేవూరి రవీందర్ రెడ్డి, నంది కిషన్, బండారి బాల్ రెడ్డి, గుండాడి రాంరెడ్డి , రఫీక్ , రావుల ముత్యం రెడ్డి, వడ్నాల ఆంజనేయులు, ముద్దుల శ్రీ పాల్ రెడ్డి , దోమ్మాటి రాజు , సిరిపురం కిషన్ , బీపేట రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube