కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండలంలో బద్దేనపల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో కౌంటింగ్‌ కేంద్రాలు, స్ర్టాంగ్‌ రూం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పి అఖిల్ మహాజన్ లు బుధవారం సంయుక్తంగా పరిశీలించారు.స్ర్టాంగ్‌ రూంలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు అన్ని వైపులా ఉండాలని సూచించారు.

 Rajanna Siricilla Sp Collector Inspected Counting Centers, Rajanna Siricilla, Sp-TeluguStop.com

సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ఒకే చోట ఉన్నందున లే అవుట్ ప్రకారం రెండు నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ కు వేరువేరుగా ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ అన్నారు.లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన భద్రతకు సంబంధించి పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ , పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube