నకిలీ గల్ఫ్ ఏజెంట్ అరెస్ట్ రిమాండ్ కు తరలింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన యువకులను మలేషియా పంపిస్తానని మోసం చేసిన నకిలీ గల్ఫ్ ఏజెంట్ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో వెల్లడించిన ఎస్.ఐ మహేష్.ఈ సందర్భంగా ఎస్.ఐ మహేష్ మాట్లాడుతూ.గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ఇరిగ నాగరాజు అనే నకిలీ గల్ఫ్ ఏజెంట్ ను గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్ తాండ కి చెందిన ముగ్గురు యువకులను,బరిగెల గూడెం కి చెందిన ముగ్గురు యువకులను మలేషియా పంపిస్తానని వారి వద్ద నుండి మూడు లక్షల అరవై వేల రూపాయలు వసూలు చేసి వారిని మలేసియా పంపకుండా గట్టిగా అడిగినందుకు వారికి నకిలీ విసాలు ఇచ్చినందున యువకుల పిర్యాదు మేరకు గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఈ రోజు నాగరాజును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

 Arrest Of Fake Gulf Agent Moved To Remand, Fake Gulf Agent , Remand, Eriga Nagar-TeluguStop.com

ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి.

నకిలీ గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు, కట్టడి చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ తరపున అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, గ్రామీణ ప్రాంతాల నుండి గల్ఫ్ కు ఉపాధి నిమిత్తం వెళ్ళేవారు ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఏజెంట్లను సంప్రదించి ఉపాధి అవకాశాలను పొందాలని పేర్కొన్నారు.జిల్లాలో ఇప్పటివరకు గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులు,నకిలీ గల్ఫ్ ఏజెంట్ల సమాచారం ఉన్న వారు స్పెషల్ బ్రాంచ్ సి.ఐ 8712656411 అనే నెంబర్ ద్వారా సంప్రదించి పూర్తి వివరాలు తెలియజేయాలని సూచించారు.అంతే కాకుండా ఉపాధి,ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళేవారు జిల్లాలోని ఏజెంట్లను సంప్రదించే ముందు వారికి సంబంధించిన పూర్తి వివరాలు అనగా ప్రభుత్వ ఏజెంట లేదా నకిలీ ఏజెంట అతని మీద ఎలాంటి కేసులు ఉన్నాయా మొదలగు సమాచారం ఈ నెంబర్ ద్వారా తెలులుకోవచ్చు అని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube