మహిళా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం.

రాజన్న సిరిసిల్ల జిల్లా : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని అంబేద్కర్ భవనంలోని ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ తీసుకుంటున్నటువంటి విద్యార్థులకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న హింస, వేధింపులు నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు, సేవలు గురించి వివరించారు.

 Awareness Program On The Occasion Of Women's Day , Rajanna Sirisilla, Ambedkar B-TeluguStop.com

మన రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి హక్కులు, చట్టాలు, సమానత్వం , గృహహింస, లైంగిక వేధింపులు స్త్రీలు, బాలికలు అక్రమ రవాణా వివిధ సంస్థలలో లైంగిక వేధింపులు, అత్యాచారాలు యాసిడ్ దాడులు వృద్ధుల పట్ల నిరాదరణ వంటి అంశాలను గురించి చర్చిస్తూ మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చట్టాలు హక్కుల పైన బాల్య వివాహాల నిరోధక చట్టం బాల కార్మిక వ్యవస్థ, డివి యాక్ట్ మరియు టోల్ ఫ్రీ నెంబర్లు పిల్లల హెల్ప్ లైన్ 1098.

మహిళా హెల్ప్ లైన్ 181.వయోవృద్ధుల హెల్ప్ లైన్ 14567, దివ్యాంగుల హెల్ప్ లైన్ 155326, గురించి అవగాహన కల్పించారు.సఖి కేంద్రం సెంటర్ అడ్మినిస్ట్రేటర్ రోజా మాట్లాడుతూ సఖి కేంద్రం అందిస్తున్నటువంటి వైద్య, న్యాయ, కౌన్సిలింగ్, పోలీస్, తాత్కాలిక నివాసం వంటి ఐదు రకాల సేవలు, లింగ వివక్షత,ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల గురించి వివరించారు మహిళలు బాలికలు ఏదైనా హింస గురైతే ధైర్యంగా టోల్ ఫ్రీ ద్వారా సంప్రదిస్తే వారి సమస్యను గురించి గోప్యంగా ఉంచబడుతుందని మరియు వారికి కావలసిన సహాయాన్ని వెంటనే ఉచితంగా అందిస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సఖి కేంద్రం కౌన్సిలర్ దేవిక , కేస్ వర్కర్ అంజలి, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రాఘవేందర్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube