రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామివారిని శనివారం సంగారెడ్డి ఎస్పి సీహెచ్ రూపేష్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎస్పీ దంపతులు పరివార దేవతాలను సైతం దర్శించుకుని పూజలు చేశారు.
అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వదించగా పర్యవేక్షకులు వి.వెంకట ప్రసాద్ లడ్డూ ప్రసాదం అందజేశారు.