ప్రభుత్వాలు మారిన ఆ కుటుంబాల తరరాత మారలే బండ కొట్టుకుంటూ బతుకుతున్న ఆ కుటుంబాలకు దిక్కెవరు దుమాల (తుర్కాశిపల్లి )ని సందర్శించిన బిఎస్పి నాయకులు.ఎల్లారెడ్డిపేట చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి మార్చి 18:ప్రభుత్వాలు మారిన వారి తలరాతలు మారలేదు.బండ కొట్టుకొని జీవించే ఆ కుటుంబాలకు దిక్కెవరు.పల్లెకి ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే గుడిసెలలో కాలమెల్ల దీస్తున్నఆ కుటుంబాలు.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దుమాల గ్రామం (తుర్కాశిపల్లె) ను బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా, మండల నాయకులు శనివారంసందర్శించారు.ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వరదవెల్లి స్వామి గౌడ్ మాట్లాడుతూ గత 60 ఏళ్ల నుండి బండ కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్న ఇక్కడి ప్రజలు చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని అన్నారు .ఎన్నో ఏళ్ల నుండి ఎన్నో ప్రభుత్వాలు మారిన వీళ్ళను పట్టించుకునే నాధుడే లేడన్నారు.నీళ్లు,నిధులు నియామకాలు అనే తెలంగాణ ను పోరాడి తెచ్చుకున్నామని ఈ తొమ్మిదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ బడా బాబుల కే అయింది కానీ ఇలాంటి నిరుపేదలకు కాలేదు అని అన్నారు .డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీ ఆడంబరంగా జరిగిందని డబ్బాలు కొట్టుకోవడం తప్ప నిజంగా పేదవానికి అందించిన దాఖలాలు లేవని, 60 ఏళ్ల నుండి పూరిగుడిసెలోనే బతుకుతూ కాలం వెళ్ళదిస్తున్నారు.
40 కుటుంబాలలో కనీసం 50 మంది కూడా రేషన్ బియ్యం వస్తలేదనీ, ఆ పల్లెలో మురికి కాలువల నిర్మాణం లేవని ఓట్లు వేయడానికి జనాలను వాడుకుంటున్నారు తప్ప వీళ్ళ బ్రతుకులు మార్చడానికి మాత్రం ఎవరూ రావడం లేదు.
డబుల్ బెడ్ రూమ్ లు అన్న ఇప్పించండి అని కేటీఆర్ కి వినతపత్రం ఇవ్వడానికి పోతే కనీసం వార్డు మెంబర్ కూడా కాదు నీ వినతిపత్రం నేనెందుకు తీసుకోవాలని తిరస్కరించారనీ, నాలుగు కోట్ల కుటుంబం మాది అని గప్పాలు కొట్టుకునే కేటీఆర్ నాలుగు కోట్ల కుటుంబ సభ్యులలో ఈ తుర్కశిపల్లె ప్రజలు లేరా… వీళ్లు ఓట్లేయలేదా అని ప్రశ్నించారు.కంప్యూటర్ యుగం బిఆర్ఎస్ తోనే సాధ్యమైందని చెప్పుకుంటున్నటువంటి మంత్రి కేటీఆర్ విష సర్పాల వల్ల ఇక్కడ ఎంతమంది ప్రజలు చనిపోయారు తెలుసా అని ప్రశ్నించారు.
ఇకనైనా మీ మత్తు వదిలి ఈ తుర్కాశి పల్లెలో ఉన్నటువంటి నలభై కుటుంబ సభ్యులకు డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని హెచ్చరించారు.లేనిపక్షంలో ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలలో కేటీఆర్ ను ఒడగొట్టడమే మా కార్యచరణలను అమలు చేసుకుని ప్రజల తిరుగుబాటు తో ఉద్యమాన్ని తలపిస్తాం అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు తాటికొండ అంజయ్య, మండల అధ్యక్షులు నీరటి భాను, మండల ప్రధాన కార్యదర్శి షేక్ హైదర్, ఉపాధ్యక్షులు న్యాలకంటి లక్ష్మీరాజం, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గడ్డమీది సాయి చంద్, అజిత్, ఎల్లారెడ్డిపేట టౌన్ ప్రెసిడెంట్ లింగాల నిలేష్, దుమాల బూత్ కన్వీనర్, కో కన్వీనర్లు తదితరులు.పాల్గొన్నారు.