సిరిసిల్ల ‘బడ్జెట్ హోటల్’ అవసరాలకు సౌర విద్యుత్ నే వాడేలా నిర్మాణం

సౌర విద్యుత్‌ను మాత్రమే వినియోగించుకునేలా సిరిసిల్ల ‘బడ్జెట్ హోటల్’ ను నిర్మించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పర్యాటకులకు సూచించారు.పర్యాటకశాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పెద్దూర్ శివార్ లో రెండో బైపాస్ రహదారి చెంతనే రూ.18 కోట్లతో G+1 విధానంలో నిర్మిస్తున్న బడ్జెట్ హోటల్ ను రాష్ట్ర పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్, పర్యాటక ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు.పర్యాటకుల సౌకర్యార్థం నిర్మిస్తున్న ఈ బడ్జెట్ హోటల్ ను అన్ని హంగులతో పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా
మే మొదటి వారం కల్లా పూర్తి చేయాలన్నారు.

 Sircilla Budget Hotel With Solar Energy,solar Power, Solar Energy, Budget Hotel,-TeluguStop.com

ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్, పర్యాటక ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ మాట్లాడుతూ.హోటల్ నిర్మాణం పూర్తయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు, భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.

ప్రతిపాదిత బడ్జెట్ హోటల్లో భక్తుల సౌకర్యార్థం గదులతోపాటు కాన్ఫరెన్స్ హాలు కూడా నిర్మిస్తున్నామని, ఇందులో శుభకార్యాలు నిర్వహించేందుకు అవకాశం ఉందన్నారు.సరసమైన ధరలతో ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రంలో బడ్జెట్‌ హోటళ్ ను నిర్మిస్తుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube