సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా : సైబర్ నేరాలకు గురైతే చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100,లకు తక్షణమే కాల్ చేయండని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారని, సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఆసరా చేసుకుని అమాయక ప్రజలను అధిక వడ్డీ ఆశా చూపి పెట్టిన పెట్టుబడి కంటే అధిక డబ్బులు వస్తాయని మోసం చేస్తున్నారని, జిల్లా ప్రజలు ఇలాంటి అన్ లైన్ యాప్ లలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు అని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

 Be Careful With Cyber Crimes Sp Akhil Mahajan, Cyber Crimes ,sp Akhil Mahajan,-TeluguStop.com

జిల్లా ప్రజలు ఎవరైనా సైబర్ మోసాలకు గురి అయితే వెంటెనే హెల్ప్ లైన్ నంబర్ 1930 ,డయల్ 100 కి కాల్ చేసి తెలియజేయగలరని అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈ వారం రోజుల వ్యవధిలో జరిగిన కొన్ని సైబర్ నేరాలు.

వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి వాట్సాప్ లో ఒక మెసేజ్ రావడం జరిగింది.ఆ మెసేజ్ లో బిట్కాయిన్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఉంది బాధితుడు దానిని నమ్మి కాల్ చేసి బిట్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా 114000 చేయడం జరిగింది కానీ తర్వాత కానీ బాధితుడు లక్ష 14 వేల రూపాయలు నష్టపోయాడు.

బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి క్రెడిట్ కార్డ్ ఆన్యూవల్ చార్జెస్ తీసివేయడానికి అని చెప్పి ఫ్రాడ్ సర్ ఒక లింక్ పంపడం జరిగింది లింక్ క్లిక్ చేసిన తర్వాత ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ జరిగింది తర్వాత బాధితుడు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ షేర్ చేసుకోవడం ద్వారా బాధితుడు 30 వేల రూపాయలు నష్టపోయాడు.

గంబిరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి పాన్ కార్డు లింక్ కోసం అని చెప్పి వాట్సాప్ లో ఒక మెసేజ్ అవడం జరిగింది పవిత్రుడు ఆ లింక్ ఓపెన్ చేసి క్రెడిట్ కార్డు డీటెయిల్స్ షేర్ చేసుకోవడం ద్వారా 14000 నష్టపోయాడు.

● ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పదోడికి ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడం జరిగింది దాంట్లో భాగంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాల్ చేస్తున్న మీ యొక్క క్రెడిట్ కార్డు అప్డేట్ కోసం అని చెప్పి ఒక లింక్ పంపించగా లింక్ క్లిక్ చేయడం ద్వారా ఆ ఇన్స్టాల్ చేయడం జరిగింది.దాని ద్వారా బాధితుడు యొక్క క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ షేర్ చేసుకోవడం జరిగింది.దిగుతారా బాధితుడు 98000 నష్టపోయాడు.

సైబర్ నేరాలకు గురి కాకుండా క్రింది జాగ్రత్తలు పాటించాలి:-

●ఓటిపి మోసాలు,ఈ మెయిల్స్ ద్వారా వచ్చే ఉద్యోగ ప్రకటన పట్ల జాగ్రత్తగా ఉండండి.
●సంస్థల నకిలీ ఈమెయిల్ ఐడి లతో జాగ్రత్తగా ఉండండి.
● ఆన్లైన్ షాపింగ్ మోసాలతో జాగ్రత్తగా ఉండండి.
● రుణ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి.
●డెబిట్/ క్రెడిట్ కార్డ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి.
● లాటరీ మెయిల్స్/ మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
● మొబైల్స్ ఫోన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
● మీతోనే తప్పు చేయిస్తారు, మీ అకౌంట్ లోని డబ్బులు దోచేస్తారు జాగ్రత్త.
● పెట్టుబడులు పెడతామంటూ ఫేస్బుక్ ద్వారా ఆకర్షిస్తారు జాగ్రత్త.
● ప్రేమ చిత్రాలను సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్మెయిల్.
● అనధికార లింకులను నొక్కితే మీ ఫోన్ హ్యాకర్ కంట్రోల్ కు వెళుతుంది జాగ్రత్త.
● భీమా కంపెనీల పేరుట మోసాలు.
● ఈ ఫైలింగ్ & ఇన్కమ్ టాక్స్ రిఫండ్ పేరిట మోసాలు.
● విదేశాల నుంచి మాట్లాడుతున్నట్లు సృష్టించి వాట్సప్ వేదికగా సైబర్ మోసాలు.
● లక్కీ డ్రాలో ఎంపికైనట్లు ఎర వేసి మోసాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube