బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా: బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలి - తీగల శేఖర్ గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని అన్నారు.

 Dr Br Ambedkar Ambition Should Be Achieved By Everyone Thigala Shekhar Goud, Dr-TeluguStop.com

డా బీ,ఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అందాలో గొప్ప దిశా నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిన మహనీయుడు అంబేద్కర్‌ అని కొనియాడారు.

అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు రిజర్వేషన్లు పొందుతున్నామన్నారు.1982 అన్న నందమూరి తారకరామారావు, మహత్మా జ్యోతిరావు పూలే,అంబేద్కర్ ఆశయ లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు.సామాన్యులకు ప్రభూత్వ పలాలు అందాలనే ఉద్దేశ్యం తో రాజ్యాంగ బద్దంగా మాండలిక వ్యవస్థ ను ఏర్పాటు చేసారని ఈ సందర్భంగా గుర్తు చేసారు.

బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచారన్నారు.ఈ కార్యక్రమంలో టీ,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి,పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బింగి వెంకటేశం,తంగళ్లపెళ్లి ప్రధాన కార్యదర్శి పంజా బాలరాజు,ఆరే మల్లేశం, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube