రాజన్న సిరిసిల్ల జిల్లా :సమగ్ర ఇంటింటి కుటుంబ (సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల) సర్వేలో భాగంగా సర్వే పూర్తయిన కుటుంబాల యొక్క సమాచారాన్ని కంప్యూటర్ ఆన్లైన్ సాఫ్ట్వేర్ లో నమోదు చేసేందుకు మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ పూర్తి చేశామని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తెలిపారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లాలోని 28 మంది మాస్టర్ ట్రైనర్లకు సర్వేలో సేకరించిన డాటా ఆన్లైన్ లో నమోదు చేసే విధానం పై శనివారం అదనపు కలెక్టర్, జిల్లా ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు.ప్రతి మండలానికి ఇద్దరు అలాగే ప్రతి మున్సిపాలిటీకి నలుగురు చొప్పున మొత్తం 28 మంది మాస్టర్ ట్రెయినీలకు రాజన్న సిరిసిల్ల కేంద్రంలో శిక్షణ పూర్తి చేశామని వివరించారు.
అనంతరం మాస్టర్ ట్రైనర్లు మండల కేంద్రాలు, జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో ఎంపిక చేసిన 480 మంది ఆపరేటర్లకు సర్వేలో భాగంగా సేకరించిన అంశాల డాటా ఎంట్రీ పై శిక్షణ ఇచ్చారని తెలిపారు.శిక్షణ పొందిన ఆపరేటర్లు డాటా ఎంట్రీ శనివారం(ఈ రోజు) నుంచి జిల్లాలో ప్రారంభించారని వెల్లడించారు.