స్పెషల్ డే నాడు మరింత స్పెషల్ గా మెరిసిపోవాలా.. అయితే ఈ రెమెడీ మీ కోసమే!

సాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్ లో బర్త్ డే, మ్యారేజ్ డే అంటూ కొన్ని కొన్ని స్పెషల్ డేస్ అంటూ ఉంటాయి.ఆ స్పెషల్ డేస్ లో తాము మరింత స్పెషల్ గా మెరిసి పోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది.

 This Is The Remedy That Makes The Face Beautiful And Glowing! Beautiful Face, Gl-TeluguStop.com

అందుకే చర్మం కోసం రకరకాల ఖరీదైన ఉత్పత్తులను వాడుతుంటారు.స్పెషల్ డే వస్తోందంటే వారం, పది రోజుల ముందు నుంచే ఫేషియల్, స్కిన్ బ్లీచింగ్ వంటివి చేయించుకుంటారు.

అయితే వాటి వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందో పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ మాత్రం మీ స్పెషల్ డేస్ లో మిమ్మల్ని మరింత స్పెషల్ గా కనిపించేలా చేస్తుంది.

 This Is The Remedy That Makes The Face Beautiful And Glowing! Beautiful Face, Gl-TeluguStop.com

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో అర కప్పు బెల్లం తురుము, ఒక చిన్న కప్పు వాటర్ వేసుకుని కనీసం పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

ఇలా ఉడికించుకున్న బెల్లం సిరప్ ను కాస్త చల్లారపెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి, వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని కలుపుకోవాలి.

చివరగా అందులో తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ కూడా వేసుకుని అన్ని కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు కాస్త మందంగా అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.కంప్లీట్ గా డ్రై అయినా అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకొని ఏదైనా మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.ఈ రెమెడీని తరచూ పాటించడం వల్ల చర్మంపై మొండి మచ్చలు, పిగ్మెంటేషన్, మృత కణాలు తొలగిపోతాయి.

ముఖ చర్మం తెల్లగా, కాంతివంతంగా మరియు ఆకర్షణీయంగా మారుతుంది.చర్మం స్మూత్ గా సైతం తయారవుతుంది.

కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.మీ స్పెషల్ డే లో మరింత స్పెషల్ గా కనిపించండి.

Video : This Is The Remedy That Makes The Face Beautiful And Glowing! Beautiful Face, Glowing Face, Home Remedy, Latest News, Skin Care, Skin Care Tips, Beauty, Beauty Tips, Face Pack #TeluguStopVideo

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube