ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మాస్ క్రేజ్ తెచ్చుకున్న రామ్ ఆ తర్వాత రెడ్ సినిమా తీసి పర్వాలేదు అనిపించుకున్నాడు.అయితే రీసెంట్ గా తమిళ దర్శకుడు లింగుసామి తో కలిసి చేసిన ది వారియర్ మూవీ అంచనాలను అందుకోలేదు.
తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సినిమా మరోసారి రామ్ కి షాక్ ఇచ్చింది.ఈ సినిమా ఇచ్చిన రిజల్ట్ చూసి రామ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమాకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ లో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.
ఈ క్రేజీ కాంబో సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.పెళ్లిసందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల ఆ ఒక్క సినిమాతో అరడజను సినిమాలకు పైగా ఛాన్సులు అందుకుంది.
రవితేజతో ధమకా సినిమాలో నటిస్తున్న శ్రీలీల.వైష్ణవ్ తేజ్ సినిమాలో కూడా నటిస్తుంది.
ఈ సినిమాలతో అమ్మడు తన సత్తా చాటనుంది.రామ్ బోయపాటి సినిమాలో కూడా శ్రీలీల లక్కీ ఛాన్స్ అందుకుంది.
ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.సినిమా కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషన్ అడిగిందని టాక్.
ఫ్రెష్ ఫేస్ కాబట్టి ఆమె వల్ల సినిమాకు కొంత ప్లస్ అవుతుందని ఆమె అడిగినంత ఇచ్చేస్తున్నారట నిర్మాతలు.